Begin typing your search above and press return to search.
ఈసీ గంగిరెడ్డికి ఘన నివాళులర్పించిన వైఎస్ భారతి..
By: Tupaki Desk | 23 Jan 2022 6:30 AM GMTడాక్టర్ ఈసీ గంగిరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కూతురు వైఎస్ భారతి గంగిరెడ్డి సమాధి వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో పులివెందులలోని గంగిరెడ్డి సమాధి వద్దకు వచ్చిన భారతి తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం గంగిరెడ్డి అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదలకు దుస్తులను పంపిణీ చేశారు. అలాగే వైఎస్ రాజారెడ్డి భవన్ వద్ద వైఎస్ మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వర ప్రసాద్ పార్టీ శ్రేణులు గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఏపీ సీఎం జగన్ మామ, ప్రముఖ వైద్యుడు అయిన గంగిరెడ్డి 2020 అక్టోబర్ 2న అనారోగ్యంతో మృతి చెందారు. పులివెందులలో గంగిరెడ్డికి ప్రత్యేక పేరు ఉంది. 2001 నుంచి 2005 వరకు పులవెందుల ఎంపీపీగా పనిచేశారు. 2003లో రబీ విత్తనాల కోసం పులివెందుల నుంచి కడక కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేశారు. గత ఏడాది అక్టోబర్లో జరిగిన గంగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ‘మరుపురాని జ్ఒపకం’ అనేపుస్తకాన్ని ఆవిష్కరించారు. పేదల పాలిన పెన్నిది అని సీఎం జగన్ ఈ సందర్భంగా చెప్పారు.
ఇక రాయలసీమ జిల్లాల్లో ప్రముఖ వైద్యుడిగా పేరున్నగంగిరెడ్డి రాజకీయాల్లోకి కూడా వచ్చారు. ఆయన ఎంపీటీసీగా ఉన్న సమయంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే పేదలకు వైద్యం చేయాలన్న తపనతో గంగిరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అందుకే గంగిరెడ్డికి పేదల డాక్టర్ అనే పేరుంది.