Begin typing your search above and press return to search.
జగన్ ను చూస్తుంటే బాధేస్తోందంటున్న భార్య
By: Tupaki Desk | 12 Oct 2015 12:06 PM GMTఆరు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న వైయస్ జగన్ ఆరోగ్యం క్షీణిస్తుండడంపై ఆయన భార్య తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రక్తంలో చక్కెర స్థాయి 61కి వచ్చేసిందన, అది కనీసం 80 ఉంటేనే మంచిదని వైద్యులు చెబుతున్నారని ఆమె అన్నారు. ఆరు రోజులుగా తిండి లేకుండా దీక్ష చేస్తున్న జగన్ పై మంత్రులు కామినేని శ్రీనివాస రావు - పత్తిపాటి పుల్లారావు అనుమానాలు వ్యక్తం చేయడంపైనా భారతి మండిపడ్డారు తన భర్త ఆరోగ్య పరిస్థితిపై మంత్రులు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ఆమె ఆరోపించారు. మంత్రులు వాళ్లేం చేస్తారో అది మాట్లాడితే మంచిది గానీ, పక్కవాళ్లను తప్పు పడితే ఎలా అని ప్రశ్నించారు.
జగన్ ఆరు రోజులుగా ఏమీ తినడం లేదని.. తనకు చాలా బాధగా ఉందని భారతి ఆవేదన చెందారు. నీరసించిన జగన్ వద్ద కూర్చుని ఆమె చాలాసేపు మాట్లాడారు. కాగా జగన్ సోదరి షర్మిల కూడా అన్నను చూసేందుకు బెంగళూరు నుంచి వస్తున్నారు. మరోవైపు వైసీపీ నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, టీడీపీలపై విరుచుకుపడుతున్నారు. ఆ పార్టీ నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ... గతంలో చంద్రబాబు చేసినవి దొంగ దీక్షలని... తమ నాయకుడిది అసలైన దీక్షని అన్నారు. చంద్రబాబు నిరాహార దీక్ష చేస్తే షుగర్ - బిపి లెవెల్స్ ఎందుకు డౌన్ కాలేదని ఆయన అడిగారు. దమ్ముంటే నారా లోకేష్ తో జగన్ కు సమానంగా దీక్ష చేయించాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు. వైసీపీకి చెందిన సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డిని చంపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు.