Begin typing your search above and press return to search.
వైరల్ పిక్: జగన్ - షర్మిల ఎడమొహం.. పెడమొహమేనా?
By: Tupaki Desk | 2 Sep 2021 9:30 AM GMTవైఎస్ షర్మిల రాజకీయాల్లోకి అడుగుపెట్టి, తన సొంత రాజకీయ పార్టీని స్థాపించినప్పటి నుండి వైఎస్ ఫ్యామిలీలో విభేదాలు తలెత్తాయన్న చర్చ జోరుగా సాగింది. షర్మిలకు ఆమె సోదరుడు వైఎస్ జగన్ కు మధ్య అంతా సరిగ్గా లేదని ప్రచారం సాగింది. నిజానికి షర్మిల తన రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించినప్పటి నుంచి ఒక్కసారి కూడా జగన్‌ను కలవలేదు.
వైఎస్ఆర్ అభిమానులు, అనుచరులు.. వైఎస్ఆర్ సీపీ మద్దతుదారులు, జగన్-షర్మిల ఒకరినొకరు ఎప్పుడు కలుసుకుంటారని ఎదురుచూస్తున్నారు. తొలుత షర్మిల ఇడుపులపాయలో వైఎస్ఆర్ వర్థంతికి హాజరు కాకపోవచ్చు అని అనుకున్నారు. విజయమ్మ కూడా రాదని అనుకున్నారు. ఎందుకంటే విజయమ్మ హైదరాబాద్‌లో ఇదే రోజున వైఎస్ స్మారక సమావేశాన్ని ప్లాన్ చేశారు.
అయితే అందరిని ఆశ్చర్యపరిచే విధంగా విజయమ్మ -షర్మిల ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద కనిపించారు. షర్మిల ప్రార్థన సమర్పణ సమయంలో ఏపీ సీఎం జగన్ పక్కన కూర్చున్నారు. జగన్ -షర్మిల ఇలా కలిసిపోవడం వైఎస్ఆర్ అభిమానులు.. అనుచరులలో ఉపశమనం కలిగించింది, కానీ వారిద్దరూ కూడా ఎడమొహం.. పెడమొహంగానే ఉన్నట్టు కనిపించింది. జగన్, షర్మిల శరీర భాష .. హవభావాలు చూస్తే వారిద్దరూ మాట్లాడుకునే స్థితిలో లేరని సూచిస్తున్నాయి.
ఏదేమైనా, జగన్, షర్మిల కలిసి 12 సంవత్సరాల క్రితం ఈ రోజున మరణించిన వారి తండ్రి వైఎస్ఆర్‌కు ఘనంగా నివాళులు అర్పించడంతో కొంతలో కొంత వైఎస్ఆర్ అభిమానులకు కనువిందు చేసింది.