Begin typing your search above and press return to search.

బాబు దిగి వ‌చ్చారు..ఎలానో చెప్పిన జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   17 March 2018 6:43 AM GMT
బాబు దిగి వ‌చ్చారు..ఎలానో చెప్పిన జ‌గ‌న్‌
X
ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆస‌క్తిక‌ర విష‌యాన్ని చెప్పుకొచ్చారు. హోదా విష‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దిగి వ‌చ్చిన వైనాన్ని ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు. త‌న‌కు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కంటే మ‌రేదీ ముఖ్యం కాద‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు.

ఏపీ ప్ర‌త్యేక హోదా కోసం మోడీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి.. ఆ వెంట‌నే పిల్లిమొగ్గ వేసిన చంద్ర‌బాబు తీరును జ‌గ‌న్ పార్టీ త‌ప్పు ప‌ట్టింది. రాష్ట్ర ప్ర‌యోజ‌నం కోసం తాను ఏ త్యాగానికైనా సిద్ధ‌మ‌ని తేల్చి చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ‌రోమారు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు త‌మ‌కు అందింద‌ని.. దానిపై సోమ‌వారం స‌భ‌లో చ‌ర్చిస్తామ‌ని లోక్ స‌భ స్పీక‌ర్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో జ‌గ‌న్ వ‌రుస ట్వీట్లు చేశారు.

ఆయ‌న ట్వీట్లు చూస్తే.. ప్ర‌త్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ నాలుగేళ్లుగా చేస్తున్న అవిశ్రాంత పోరాటం ఫ‌లితంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ఆయ‌న పార్టీ దిగి రాక త‌ప్ప‌లేదు అని పేర్కొన్నారు. మ‌రో ట్వీట్లో.. రాజ‌కీయ‌ప్ర‌యోజ‌నాల కంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యం. ముందు అవిశ్వాసం తీర్మానం ప్ర‌వేశ‌పెట్టినా.. ఎవ‌రి తీర్మానం పరిగ‌ణ‌లోకి తీసుకుంటార‌నేది ముఖ్యం కాదు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ పౌరుల హ‌క్కుల‌కు హామీ దొరికిందా? రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా వ‌చ్చిందా? అన్న‌దే ముఖ్య‌మ‌న్నారు.

హోదాపై తాము చేస్తున్న పోరాటాన్ని చూసి ఎట్ట‌కేల‌కు దేశంతో పాటు టీడీపీ మేల్కొంద‌న్నారు. రాజ‌కీయంగా మ‌రో మార్గం లేని త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని టీడీపీ మ‌రోసారి అనుస‌రించింద‌న్నారు. ఇది ముమ్మాటికి ఏపీ ప్ర‌జ‌లు.. ప్ర‌జాస్వామ్యం సాధించిన విజ‌యాలుగా జ‌గ‌న్ అభివ‌ర్ణించారు. హోదా సాధ‌న‌లో భాగంగా తాము ప్ర‌వేశ పెట్టే అవిశ్వాస తీర్మానానికి మ‌ద్ద‌తు కోరుతూ జ‌గ‌న్ లేఖ‌లు రాసిన విష‌యం తెలిసిందే. బాబు పిల్లిమొగ్గ‌లు వేస్తూ.. పొలిటిక‌ల్ మైలేజీ కోసం ప్రాకులాడుతున్న వేళ‌.. త‌న‌కు అలాంటివేమీ లేద‌ని.. ఏపీ ప్ర‌జ‌లు త‌ప్పించి మ‌రేమీ ముఖ్యం కాద‌ని తేల్చి చెప్పిన వైనం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. జ‌గ‌న్‌కు.. చంద్ర‌బాబుకు మ‌ధ్య‌నున్న వ్య‌త్యాసం తాజా ట్వీట్లు చెప్ప‌క‌నే చెప్పేశాయ‌ని చెప్పాలి.