Begin typing your search above and press return to search.
ఔనన్నా కాదన్నా.. మార్పు తప్పదు.. జగన్ చెబుతున్న సూత్రం ఇదే..!
By: Tupaki Desk | 25 Aug 2022 4:14 AM GMTరాజకీయాల్లో నాయకులు బలంగా ఉండడం కొంత వరకు పని చేస్తుంది. అయితే.. క్షేత్రస్థాయిలో కార్యక ర్తలు.. నాయకులు కూడా అంతే బలంగా ఉండాలి. వచ్చే ఎన్నికలు వైసీపీకి తాడోపేడో.. అన్నట్టుగా లేవు. ఎట్టి పరిస్థితిలోనూ విజయం దక్కించుకుని తీరాలనే విధంగా వ్యూహాత్మకంగా ఉన్నాయి. నవ్యాంధ్రలో రెండోసారి అధికారంలోకి వచ్చి తీరాలని వైసీపీ అధినేత జగన్ పక్కాగా నిర్ణయించుకున్నారు. ఈ విష యంలో ఎలాంటి తేడా లేదు.. రాదు! ఇదీ.. అధిష్టానం చెబుతున్న మాట.
అందుకే.. ముందు ప్రజల మనసులో మూడేళ్లపాలనపై ఏముందో జగన్ తెలుసుకుంటున్నారు. పైకి.. గడపగడప అనే పేరు పెట్టి.. ఎమ్మెల్యేలను పంపిస్తున్నా.. మంత్రులను రంగంలోకి దించుతున్నా.. దీని వెనుక.. వచ్చే ఎన్నికలకు సంబంధించి చాలా వ్యూహాత్మకంగానే జగన్ ముందుకు సాగుతున్నారనేది తాడేపల్లి నుంచి వస్తున్న సమాచారం. గత ఎన్నికల్లో స్వయంగా తనే రంగంలోకి దిగి ప్రజల మధ్య ఉన్నా రు. పాదయాత్ర చేశారు. దీంతో ప్రజలకు ఏం కావాలో..ఏం కోరుకుంటున్నారో.. పసిగట్టారు.
అయితే.. ప్రజల మనోభావాలు ఎప్పుడూ.. ఒకే విధంగా ఉండవు. ఎప్పటికప్పుడు.. వారి కోరికలు.. ఆశలు మారుతుంటాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు తన పాలన మూడేళ్లు గడిచిన తర్వాత కూడా ప్రజల ఆశలు నెరవేరలేదా? అనేసందేహం.. సహజంగానే పాలకులకు రావాలి.
వస్తుంది. అలా వచ్చినప్పుడే.. చేస్తున్న పనుల్లో లోపాలను సరిదిద్దుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు జగన్ కూడా అదే చేస్తున్నారు. పైకి గడపగడప అంటూ.. చేస్తున్న యాత్రల్లో ప్రజల మనసును ఆయన కనిపెడుతున్నారని అంటున్నారు.
దీని ప్రకారం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితమైన మార్పునకు నాంది పలకాలని.. జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆ మార్పు ఎలా ఉంటుంది? నాయకులను మార్చడమా? లేక.. విధానాలను మార్చడమా.. లేక.. మేనిఫెస్టోను మార్చడమా? అనే విషయాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ఇప్పటికైతే.. పనిచేయ ని వారిని పక్కన పెడతాననే పిలుపు మాత్రం వినిపిస్తోంది. ఫలితంగానేచాలా మంది నాయకులు ప్రజా బాట పట్టారు. లేకపోతే.. ఎక్కడికక్కడ ఉండేవారు. ఇక, మిగిలిన వాటిపై త్వరలోనే జరగనున్న ప్లీనరీ వేదికగా.. జగన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.