Begin typing your search above and press return to search.
గతాన్ని మరిచి గొప్పలు చెబితే ఇలాంటి చిక్కులే జగన్!
By: Tupaki Desk | 28 July 2022 1:30 PM GMTదేశ ప్రధాని మొదలు మారుమూల గ్రామ సర్పంచ్ వరకు.. అందరూ కూడా తాము బాగా చేశామని.. గతానికి మించి చేసినట్లుగా గొప్పలు చెప్పుకోవటం సర్వ సాధారణం. నోరు విప్పితే చాలు.. గొప్పలే తప్పించి తప్పులు మాత్రం చెప్పని వైనం కనిపిస్తుంటుంది. ఇప్పుడున్న దూకుడు రాజకీయాల్లో ఎవరికి వారు తమకు మించినోళ్లు లేరన్నట్లుగా మాటలు చెప్పటం.. చేసిన పావలా పనికి రూపాయి పావలా బిల్డప్ ఇవ్వటం ఇటీవల కాలంలో ఎక్కువైంది. ఇలా మాటలు చెప్పే వారంతా.. గతంలో అంతకు మించి జరిగిన విషయాల్ని పట్టించుకోకపోవటమే కాదు.. వాటిని గుర్తు తెచ్చుకొని తమను ప్రజలు తప్పు పడతారన్న సోయి లేనట్లుగా వ్యవహరించటం ఈ మొత్తానికి హైలెట్ అంశంగా చెప్పొచ్చు.
భారీ వర్షాలు.. తదనంతరం చోటు చేసుకున్న వరదల కారణంగా ఏపీలోని రెండు జిల్లాల్లోని పలు ప్రాంతాలు.. అక్కడి వేలాది మంది ప్రజలు ఎంతలా తిప్పలు పడుతున్నారో తెలిసిందే. వారిని ఓదార్చేందుకు.. వారి కష్టాల్ని తెలుసుకొని.. ప్రధానమంత్రి మోడీకి చెప్పేందుకు.. గడిచిన రెండు రోజులు ఆయా ప్రాంతాల్లో పర్యటించటం తెలిసిందే. కేంద్రం ఇచ్చే సాయం కోసం ఢిల్లీకి వెళ్లి మరీ ప్రాధేయపడేందుకు సిద్ధమైన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వరదల కారణంగా దారుణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల వద్దకు వచ్చేందుకు దాదాపు వారం.. పదిరోజుల పట్టటం గమనార్హం.
ఎప్పుడు వచ్చామన్నది పాయింట్ కాదు.. వచ్చామా? లేదా? అన్న సినిమా డైలాగులకు ఏ మాత్రం తీసిపోని రీతిలో సీఎం జగన్ పర్యటన సాగింది. అందరికి అన్ని చేస్తానన్న ఆయన.. అదంతా 2 నెలల తర్వాత అంటూ చావు కబురు చల్లగా చెప్పటమే కాదు.. బాధితులకు అందించే ఆర్థిక సాయం కేంద్రం నుంచి మరీ తీసుకొచ్చిన తర్వాత అంటూ హైలెట్ పాయింట్ ను చెప్పి అందరిని విస్మయానికి గురి చేశారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. కష్టాల్లో ఉన్న ప్రజల్ని పరామర్శించేందుకు ప్రజల మధ్యకు రావటానికి జరిగిన ఆలస్యాన్ని ఎవరూ ప్రశ్నించకూడదని సీఎం జగన్ భావించినట్లుగా కనిపిస్తోంది. అందుకే ఆయనో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారు. తన పాలన ఎంత గొప్పగా ఉందన్న విషయాన్ని చెప్పేలా ఆయన మాటలు ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ నోటి నుంచి వచ్చిన అమూల్యమైన వ్యాఖ్యల్ని యథాతధంగా చూస్తే..
''మామూలుగా తూర్పు.. పశ్చిమ గోదావరిజిల్లాలకు కలిపి ఇద్దరు కలెక్టర్లు.. ఇద్దరు జేసీలు ఉండేవారు. ఇప్పుడు ఆరుగురు కలెక్టర్లు.. ఆరుమంది జేసీలు.. సచివాలయ వ్యవస్థ.. వలంటీర్లు.. ఆశా వర్కర్లు ఇంతమంది కలిసి అందరికి సహాయం అందేలా చూసేందుకు తపన.. తాపత్రయం పడుతున్నారు. గతం కంటే ఇప్పుడు భిన్నంగా పరిస్థితి ఉందని గమనించాలి. వరదల వేళ నాలుగు మండలాలకు సంబంధించి ఇక్కడే కాపురం పెట్టిన కలెక్టర్ ను ఎప్పుడైనా చూశారా? ఎన్నడూ చూడలేదు. ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా.. అందరికి సహాయం అందించేందుకు అధికారులందరూ ఇప్పుడు ఇక్కడకు వచ్చారు. గతంతో పోలిస్తే ఎంత మార్పు వచ్చిందో గమనించాలని కోరుతున్నా'' అంటూ పేర్కొన్నారు.
నిజమే.. సీఎం జగన్ చెప్పింది అక్షరాల నిజం. ఆయన చెప్పినవన్నీ వాస్తవాలే. కాకుంటే.. గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు ఏదైనా విపత్తు.. ఎక్కడైనా ఏర్పడితే గంటల వ్యవధిలో అక్కడకు చేరుకోవటం.. మొత్తం పాలనా వ్యవస్థను అక్కడే దించేవారు. ఇప్పుడు ఆరుగురు కలెక్టర్లు ఉన్న విషయాన్ని గొప్పగా చెబుతున్న ముఖ్యమంత్రి జగన్.. అప్పట్లో యావత్ రాష్ట్ర ప్రభుత్వమే అక్కడే ఉండేదన్న విషయాన్ని మర్చిపోవటం దేనికి నిదర్శనం? గతాన్ని ప్రస్తావిస్తూ గొప్పలు చెబితే సీఎం జగన్ కు ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి. అయినా.. గతాన్ని ప్రస్తావించి.. ఆత్మరక్షణలో పడేలా సీఎం జగన్ ఎందుకు వ్యవహరిస్తున్నారు అన్నది అసలు ప్రశ్న. దీనికి సమాధానం చెప్పేవారెవరో?