Begin typing your search above and press return to search.
ఇదే జగన్ నినాదం : టీడీపీకి ఓటేస్తే సంక్షేమ పధకాలుండవు...
By: Tupaki Desk | 9 July 2022 11:11 AM GMTవచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒక పవర్ ఫుల్ నినాదాన్ని ఎంచుకుంది. ప్లీనరీ వేదికగా రెండు రోజుల పాటు సాగిన పార్టీ సమావేశాల్లో క్యాడర్ కి దిశా నిర్దేశం జరిగింది. ఆ మేరకు ఇక మీదట పార్టీ శ్రేణులు జనాలలోకి కదలి వెళ్లాలి. వారు చెప్పాల్సింది కూడా ఒకటి ఉంది. అదే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓట్లేస్తే సంక్షేమ పధకాలు ఉండవు. అంటే బాబు పధకాలకు వ్యతిరేకం అని గట్టిగా చాటాలన్న మాట.
జగన్ ప్లీనరీ రెండవ రోజుల అధ్యక్షుడిగా ఎన్నిక అయిన తరువాత ఇచిన ఉపన్యాసంలో చాలా విషయాలు చెప్పుకొచ్చారు. కానీ అందులో జగన్ నినాదం కూడా ఉంది. చంద్రబాబుకు ఓటేస్తే పధకాలు ఉండవని ఆయన గట్టిగానే చెబుతున్నారు.
అంటే ఇది వైసీపీ రేపటి ఎన్నికల నినాదం అన్న మాట. ఇప్పటిదాకా వైసీపీ పంచుడు కార్యక్రమాల మీద విమర్శలు చేస్తూ వచ్చింది కానీ ఇదీ మా విధానం అని వైసీపీ సంక్షేమ పధకాల మీద చెప్పలేకపోయింది
దానికి కారణం సంక్షేమ పధకాలు అంటే ఏపీలో మళ్ళీ పెద్ద ఎత్తున అప్పులను తలకెత్తుకోవడమే. వైసీపీని అప్పుల కుప్ప పాలన అని విపరీతంగా విమర్శిస్తున్న టీడీపీ తానూ పెద్ద ఎత్తున సంక్షేమ పధకాలు అమలు చేస్తామని చెప్పడం అంటే ఇండైరెక్ట్ గా వైసీపీని సపోర్ట్ చేసినట్లే. అలా కాకుండా ఏ పధకం ప్రకటించకుండా ఎన్నికలకు వెళ్తే ఫలితాలు ఎలా ఉంటాయో తెలియదు.
ఈ రోజుకు అభివృద్ధి అని జనాలు అంటున్నా తీరా ఎన్నికల వేళకు సంక్షేమ పధకాలు కూడా కావాలీ అంటే మాత్రం అపుడు ఎన్నికలు ఆసక్తిగా మారుతాయి. ఈ వ్యూహంతోనే వైసీపీ మీకు పధకాలు కావాలీ అంటే వైసీపీకే ఓటేయాలని నినదిస్తోంది.
మరి ఇది ఎంతవరకూ జనాల్లోకి వెళ్తుందో చూడాలి. అదే సమయంలో వైసీపీ నినాదాన్ని తిప్పికొట్టే పక్కా వ్యూహం టీడీపీ దగ్గర ఉందా అన్నది కూడా చూడాలి.