Begin typing your search above and press return to search.
బాబు కు జలక్..చిత్తూరు నుంచే మొదలెడుతున్న జగన్
By: Tupaki Desk | 1 Jan 2020 7:35 AM GMTప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత జిల్లా లో ప్రతిష్టాత్మక భారీ పథకాన్ని ప్రారంభిస్తూ సీఎం జగన్ గట్టి షాక్ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల కుటుంబాలకు ఏటా 15వేల రూపాయల నగదు మొత్తాన్ని ప్రోత్సాహకరంగా అందించే అమ్మఒడి భారీ పథకాన్ని జగన్ ఈనెల 9న చిత్తూరు జిల్లాలో ప్రారంభిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
చిత్తూరు లోని గ్రీమ్స్ పేట సంజీవ్ గాంధీ నగర్ లోని పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాల లో బహిరంగ సభను జగన్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు సాగుతున్నాయి.
సీఎం గా జగన్ బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు అవుతోంది. ఇప్పటి వరకూ చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో అడుగుపెట్టలేదు. ఇప్పుడు తొలిసారి భారీ పథకాన్ని చిత్తూరు నుంచే ప్రారంభిస్తూ బాబుకు షాకివ్వబోతున్నారు.
దేశవ్యాప్తంగా ఈ అమ్మఒడి పథకానికి విపరీతమైన స్పందన వచ్చింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే నిరుపేద పిల్లల తల్లుల అకౌంట్లలో 15వేల డబ్బులు జగన్ సర్కారు జమ చేయబోతోంది. దీనికోసం బడ్జెట్ లో జగన్ సర్కారు 6,455 కోట్లను కేటాయించింది.