Begin typing your search above and press return to search.
బాస్ లు సెలవు.. ఏపీ ఆన్ వెకేషన్
By: Tupaki Desk | 2 Aug 2019 5:12 AM GMTఏపీలో ఎన్నికలు ముగిసి మూడు నెలలే అయ్యింది. కానీ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాత్రం మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగింది. రెండు మూడేళ్లకు ఈ కొట్లాట ఉంటుందని ఆశించినా అసెంబ్లీ సాక్షిగా టీడీపీ- వైసీపీ మాటల మంటలు చూశాక ఏపీలో ఎన్నికలు రాజేసిన వేడి అలానే కొనసాగింది.
తెలంగాణలో ప్రతిపక్షం కాంగ్రెస్ వీక్ గా ఉంది. కేసీఆర్ తో ధీటుగా పోరాడే సెంటరాఫ్ అట్రాక్షన్ నేత లేరు. దీంతో ఇక్కడ అసెంబ్లీ అయినా బయటా అయినా చప్పగా ఉంటుంది. ఏపీలో మాత్రం జగన్, చంద్రబాబు ఢీ అంటే ఢీ అంటూ రాజకీయం చేస్తున్నారు.
ఏపీ అసెంబ్లీ మొన్నటివరకు సాగింది. ఈ సందర్భంగా మొత్తం ఎమ్మెల్యేలు- మంత్రులు- చంద్రబాబు- జగన్ లతో అమరావతి కళకళలాడింది. మాటల యుద్ధంతో ఏపీ అసెంబ్లీ అట్టుడికింది. రాజకీయ వేడి మొత్తం రాజుకుంది. అయితే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ముగిశాక మొత్తం స్తబ్ధత నెలకొంది. సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.
చంద్రబాబు ప్రస్తుతం ఆరోగ్య సమస్యలంటూ అమెరికా వెళ్లారు. అక్కడ చికిత్స తీసుకుంటూ ప్రవాస ఆంధ్రులతో సమావేశమవుతున్నారు. ఇక తాజాగా ఏపీ సీఎం జగన్ నిన్న రాత్రి హైదరాబాద్ వచ్చి తన వ్యక్తిగత పర్యటన కింద జెరుసాలెం వెళ్తున్నారు. క్రీస్తు పుట్టిన ప్రదేశాన్ని దర్శించుకొని మొక్కలు తీర్చుకుంటారు.
ఇటు చంద్రబాబు, అటు జగన్ ఏపీలో లేకపోవడంతో అమరావతి ఆన్ వెకేషన్ అంటూ రాజకీయ వర్గాల్లో స్తబ్దత నెలకొంది. ఇద్దరూ ఫారిన్ లో ఉండడం చర్చనీయాంశం కాదు.. చాలా సాధారణమైన విషయమే..కానీ సీఎం, ప్రతిపక్ష నేత ఇద్దరూ ఒకేసారి ఇద్దరూ విదేశాల్లో ఉండడమే అరుదుగా జరిగే పరిణామమే.. వీరిద్దరూ లేకపోవడంతో ఇప్పుడు అమరావతి మొత్తం బోసిపోయినట్టైంది. చంద్రబాబు, జగన్ లేకపోయేసరికి ఎమ్మెల్యేలు సొంత ఊళ్ల దారిపట్టారు. దీంతో పనుల కోసం వచ్చే వారు.. పైరవీ దారులు, ఇతర ప్రభుత్వ పనుల కోసం వచ్చేవారు ఎవ్వరూ రాకపోయేసరికి సైలెంట్ అయిపోయింది.