Begin typing your search above and press return to search.
వార్ ఆఫ్ వర్డ్స్: జగన్, బాబు ‘నీళ్ల’ యుద్ధం
By: Tupaki Desk | 11 July 2019 6:41 AM GMTఏపీ అసెంబ్లీ సాక్షిగా మాటల మంటలు చెలరేగాయి. సాగునీటి ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య మాటల యుద్ధం నడిచింది. గురువారం వీరిద్దరి మధ్య అసెంబ్లీ సాక్షిగా నీళ్ల పంచాయతీ సాగింది.
చంద్రబాబు మాట్లాడుతూ.. ఇదే జగన్ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఏపీ, తెలంగాణలు ఇండియా, పాకిస్తాన్ ల మాదిరిగా మారుతాయని అన్నారని.. మరి ఇప్పుడు ఎందుకు ప్రారంభోత్సవానికి వెళ్లారని నిలదీశారు. కేసీఆర్ ను నాడు హిట్లర్ అని తిట్టిన జగన్.. ఇప్పుడు ఆయన పిలిస్తే వెళ్లడం.. అధికారం ఉంది కదా అని ఏపీకి నీటి విషయంలో అన్యాయం చేస్తే ఊరుకోమని చంద్రబాబు ధ్వజమెత్తారు. భవిష్యత్తులో గోదావరి నీటిని కృష్ణా ఆయకట్టుకు తరలించేందుకు తెలంగాణ అంగీకరించకపోతే జగన్ ఏం చేస్తారని నిలదీశారు. ప్రస్తుతం కేసీఆర్, జగన్ మధ్య మంచి సంబంధాలు ఉండడంతో ఇబ్బంది లేదని భవిష్యత్ లో గొడవలు వస్తే ఏం చేస్తారని నిలదీశారు.
దీనిపై సమాధానమిచ్చిన సీఎం జగన్.. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు.. ఇన్నేళ్లు సీఎంగా ఉంటాడు.. గోదావరి నీటిని ఎత్తి పోసేందుకు రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందాలు చేసుకోమా? ఆ మాత్రం తెలియదా అని ఎద్దేవా చేశారు. ఈ నీటితో తెలంగాణ నాలుగు జిల్లాలు, ఏపీ 8 జిల్లాలు బాగుపడుతాయని.. తెలంగాణ నుంచే నీటిని తరలించేందుకు కేసీఆర్ ఒప్పుకోవడాన్ని అభినందించాలన్నారు.
అయినా నెలరోజులు అధికారంలో ఉన్న తనను విమర్శిస్తున్న బాబు.. ఐదేళ్లలో సీఎంగా ఉండి కాళేశ్వరం అడ్డుకోకుండా గాడిదలు కాశారా అని జగన్ తీవ్రంగా మండిపడ్డారు. ఈయన హయాంలోనే ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి కృష్ణా జలాలు రాకుండా చేశారని విమర్శించారు.
తాము సఖ్యతతో తెలంగాణతో కలిసి గోదావరి నీటిని వాడుకుంటున్నామని.. దాన్ని స్వాగతించాల్సింది పోయి బాబు విమర్శస్తున్నారని జగన్ దుయ్యబట్టారు.