Begin typing your search above and press return to search.

జగన్ మీద మమత లేదా... ?

By:  Tupaki Desk   |   9 March 2022 5:30 PM GMT
జగన్ మీద మమత లేదా... ?
X
జగన్ ఏపీలో అధికారంలో ఉన్నారు. మూడేళ్ళ క్రితం బంపర్ మెజారిటీ సాధించి జాతీయ రాజకీయ నేతల దృష్టిని ఆకట్టుకున్నారు. జగన్ సీఎం అయిన కొత్తల్లో విపక్ష పార్టీలకు చెందిన నాయకులు అయితే ఆయన వైపు ఆశగా చూసేవారు. నాడు మోడీకి యాంటీగా ఏ ప్రోగ్రాం చేపట్టినా కూడా జగన్ని కూడా పిలిచేవారు.

ఇక మోడీ సర్కార్ వైఖరి మీద నిరసన తెలియచేయడానికి కూడా జగన్ తో సహా సౌత్ లీడర్లను కలుపుకుని పోయే యత్నం చేస్తూ వచ్చారు.

మరి జగన్ నుంచి రెస్పాన్స్ పెద్దగా లేదనో, లేక ఆయన రాజకీయ వైఖరి వేరుగా ఉందనో డౌట్లు వచ్చి ఇపుడు సైడ్ చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. సాటి తెలుగు రాష్ట్రం నుంచి కేసీయార్ వెళ్ళి జాతీయ స్థాయి నేతలను కలుస్తున్నారు. వారితో భేటీలు వేస్తున్నారు. కానీ జగన్ని పట్టించుకోవడంలేదు.

ఇక మమతా బెనర్జీ వంటి లీడర్లు కూడా అప్పటో అంటే కరోనా విపత్తు వేళ రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తోంది, అంతా కలసి పోరాడాలి అంటూ లేఖలు అందరికీ రాశారు. అందులో జగన్ కూడా ఉన్నారు. అయితే ఇటీవల మమత మాత్రం జగన్ కంటే కేసీయార్ తోనే ఎక్కువగా మాట్లాడుతున్నారు అంటున్నారు.

యాంటీ మోడీ క్యాంప్ లో కేసీయార్ నే ముందుపెడుతున్నారు అని అంటున్నారు. జగన్ విషయంలో మాత్రం ఎందుకో ఆలోచిస్తున్నారు అనే మాట ఉంది. జగన్ మోడీకి మద్దతుగా ఉంటున్నారని, ఇప్పటిదాకా ఆయన బీజేపీ సర్కార్ కి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని విపక్షాలు భావిస్తున్నాయట. అందుకే ఆయనను కలుపుకోవడానికి సందేహిస్తున్నారని అంటున్నారు.

ఇక లేటెస్ట్ గా మమత యాంటీ మోడీ కూటమి కోసం దేశంలోని వివిధ పార్టీల నేతలను ఫోన్ల ద్వారా ఆహ్వానించారు అని తెలుస్తోంది. అలా కేసీయార్ తో కూడా ఆమె ఫోన్ లో మాట్లాడారని భోగట్టా. విపక్షంలో ఉన్న కీలక నేతలు, ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నాయకులు అందరితో మమత విశాలమైన వేదిక కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

అలా అందరికీ అహ్వానాలు వెళ్తున్నా ఏపీ సీఎం విషయంలో మాత్రం మమత ఏం చేస్తారు అన్నదే చర్చ. ఆయనకు అహ్వ‌నం అందుతుందా లేదా అన్నది అంతా ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.