Begin typing your search above and press return to search.

తంబీలు నీళ్లడిగితే... జగన్ ఏమన్నారో తెలుసా?

By:  Tupaki Desk   |   9 Aug 2019 3:08 PM GMT
తంబీలు నీళ్లడిగితే... జగన్ ఏమన్నారో తెలుసా?
X
తమిళనాడు రాజధాని చెన్నైలో ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా తాగు నీటికి కొరత వచ్చింది. ఆ పరిస్థితిని విన్న వైసీపీ అధినేత - ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్కడిక్కడే స్పందించేశారు. తంబీల దాహార్తిని తీర్చేందుకు యుద్ధ ప్రాతిపదికన కదలాలని ఆయన ఏపీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పొరుగు రాష్ట్రాలు... అది తెలంగాణ అయినా - కర్ణాటక అయినా - తమిళనాడు అయినా... ఆ రాష్ట్రాలతో తాను స్నేహ సంబంధాలనే నెరపుతానంటూ జగన్ ఈ చర్య ద్వారా మరోమారు నిరూపించుకున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ సర్కారుతో స్నేహ సంబందాలను కొనసాగిస్తున్న జగన్... ఇప్పుడు తమిళనాడు కష్టాలపైనా స్పందించిన తీరుతో తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారన్న వాదన వినిపిస్తోంది.

తమిళనాడు ఇబ్బందులు - దానిపై జగన్ స్పందించిన తీరుకు సంబందించిన పూర్తి వివరాల్లోకి వెళితే... చెన్నై వాసుల తాగు నీటి కష్టాలను చెప్పి సాయం చేయాలని జగన్ కోరాలని తీర్మానించిన తమిళనాడు సీఎం పళనసామి తన కేబినెట్ లోని ఇద్దరు మంత్రులు - అధికారులను అమరావతికి పంపారు. వారు శుక్రవారం అమరావతిలో జగన్ తో భేటీ అయ్యారు. చెన్నై వాసులు ఎదుర్కొంటున్న తాగునీటి కష్టాలను వారు జగన్ కు వివరించారు. అంతేకాకుండా చెన్నైవాసుల దాహార్తిని తీర్చాలంటూ జగన్ కు విన్నవించారు.

ఈ క్రమంలో ఏమాత్రం ఆలస్యం చేయని జగన్... చెన్నై వాసుల తాగు నీటి కష్టాలను తీర్చే దిశగా ఏపీ నుంచి ఎలాంటి సాయం అందించాలన్న విషయంపై సమాలోచనలు చేసి తక్షణమే చర్యలు చేపట్టాలని అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా పొరుగు రాష్ట్రాలు ఇబ్బందులు పడుతుంటే చూస్తూ కూర్చునే తత్వం తనది కాదని చెప్నిన జగన్ తమిళ మంత్రులను మంత్రముగ్ధులను చేశారని చెప్పాలి. తమ సమస్య పరిష్కారంపై జగన్ స్పందించిన తీరుతో హర్షం వ్యక్తం చేసిన తమిళనాడు మంత్రులు జగన్ కు ధన్యవాదాలు తెలిపారు.