Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కేసు.. కోర్టు ఏం చెప్పిందంటే?

By:  Tupaki Desk   |   1 July 2021 4:30 PM GMT
జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కేసు.. కోర్టు ఏం చెప్పిందంటే?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని కోరుతూ వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు వేసిన పిటిష‌న్ పై వాద‌న‌లు జ‌రిగాయి. ర‌ఘురామ వేసిన పిటిష‌న్ పై జ‌గ‌న్ త‌ర‌పు న్యాయ‌వాదులు కౌంట‌ర్ దాఖ‌లు చేశారు. దీనికి ర‌ఘురామ లాయ‌ర్లు రీజాయిడ‌ర్లు దాఖ‌లు చేశారు.

జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఉన్నారు కాబ‌ట్టి.. ఆయ‌న సాక్షుల‌ను ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంద‌ని, అందువ‌ల్ల ఆయ‌న బెయిల్ ర‌ద్దు చేసి, విచార‌ణ కొన‌సాగించాల‌ని ర‌ఘురామ త‌ర‌పు లాయ‌ర్లు కోరారు. దీనికి జ‌గ‌న్ త‌ర‌పు లాయ‌ర్లు స్పందిస్తూ జ‌గ‌న్ సాక్షుల‌ను ప్ర‌భావితం చేసే ప్ర‌య‌త్నం చేశార‌న‌డానికి ఆధారం చూపాల‌ని కోరారు. అంతేకాదు.. ఈ పిటిష‌న్ కు విచార‌ణ అర్హ‌త కూడా లేద‌ని వాదించారు.

అటు ర‌ఘురామ లాయ‌ర్లు మాత్రం.. ప్ర‌త్య‌క్షంగానో ప‌రోక్షంగానో ప్ర‌భావితం చేసే చ‌ర్య‌లు సాగుతున్నాయ‌ని, ఈ పిటిష‌న్ వేసినందుకే ర‌ఘురామ‌పై త‌ప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నార‌ని వాదించారు. ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం.. అటు సీబీఐతోపాటు ఇటు జ‌గ‌న్, ర‌ఘురామ‌ త‌ర‌పు లాయ‌ర్ల‌ను సైతం లిఖిత‌ పూర్వ‌క వాద‌న‌లు స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది. అనంత‌రం.. కేసును జూలై 8వ తేదీకి వాయిదా వేస్తున్న‌ట్టు చెప్పింది.