Begin typing your search above and press return to search.
చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
By: Tupaki Desk | 20 April 2020 8:10 AM GMTటీడీపీ అధినేత - ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు 71వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పుట్టిన రోజు వేడుకల్ని జరుపుకున్నారు. అయితే , కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో అత్యంత సాదాసీదాగా తన పుట్టిన రోజు వేడుకలని జరుపుకున్నారు. హైదరాబాద్ లో తన ఫ్యామిలీతో ఉంటున్న చంద్రబాబు అచ్చం తన షర్ట్ లాంటి ఆకారంలో ఉన్న కేక్ ను కట్ చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబుకి చాలామంది జాతీయ - రాష్ట్రస్థాయి రాజకీయ నేతలు - టీడీపీ నేతలు - కార్యకర్తలు - అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చంద్రబాబు ఇలాగే పూర్తి ఆరోగ్యంతో - చిరకాలం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
ప్రతిపక్షంలో ఉంటూ చంద్రబాబు - ఎంతో యాక్టివ్ రోల్ పోషిస్తూ - కరోనాపై పోరాటంలో దేశానికీ - ఏపీకీ అండగా ఉంటున్నారని టీడీపీ నేతలు ప్రశంసించారు.
కాగా ఏపీ సీఎం జగన్ సైతం చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు సీఎం జగన్. సంపూర్ణ ఆరోగ్యం తో చంద్రబాబు ఇలాగే సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇకపోతే , తన పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ కార్యకర్తలు - అభిమానులూ ఇళ్లలోంచి బయటకు రాకుండా... కరోనా లాక్ డౌన్ అమల్లో ఉంది కాబట్టి - దాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఉండటమే అసలైన అభిమానం అని చంద్రబాబు చెప్పినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.