Begin typing your search above and press return to search.
నాన్నకు జగన్ బర్త్ డే ట్వీట్
By: Tupaki Desk | 8 July 2018 5:55 AM GMTకొన్నిసార్లు అంతే. యాదృశ్చికంగా జరిగే అంశాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. తండ్రి వైఎస్సార్ జయంతి రోజునే జగన్ 2500 కిలోమీటర్ల అరుదైన మైలురాయిని చేరుకోవటం విశేషం.
దివంగత ముఖ్యమంత్రి.. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 69వ జయంతిని పురస్కరించుకొని ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. తండ్రి పుట్టినరోజు నాడు పాదయాత్రలో కీలకమైన 2500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోవటంయాధృశ్చికంగా పేర్కొన్నారు.
ఏపీ ప్రజల ఆశీస్సులతో పాటు తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులు కూడా తనకు ఉన్నాయనటానికి తాజా ఉదంతమే నిదర్శనమన్నారు. స్వర్గం నుంచి తన తండ్రి ఆశీర్వదించారన్నారు. హ్యాపీ బర్త్ డే నాన్న..ఎల్లప్పుడూ మాకు అండగా ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు అంటూ భావోద్వేగ ట్వీట్‌ను చేశారు.
ప్రజా సమస్యల్ని తెలుసుకునేందుకు 208 రోజుల క్రితం ప్రారంభించిన మహా సంకల్ప పాదయాత్రలో తాజాగా 2500 కిలోమీటర్ల మైలురాయిని వైఎస్సార్ బర్త్ డే వేళ అధిగమించటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ.. జగన్ పాదయాత్రకు ప్రజాస్పందన పెరగటమే కాదు.. ఆయనకు అండగా తామున్నామన్నట్లుగా వారు చూపిస్తున్న ప్రజా అభిమానం ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పక తప్పదు.