Begin typing your search above and press return to search.
బాబుకి హైబీపీ తెచ్చేలా జగన్ తాజా సవాల్!
By: Tupaki Desk | 6 April 2018 9:58 AM GMTక్లారిటీ ఉన్నోడికి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఇప్పుడు ఇలానే ఉంది. ప్రత్యేక హోదా సాధన విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హడావుడి నిర్ణయాలు తీసుకోవటంతో పాటు.. డబుల్ స్టాండ్ తో వ్యవహరిస్తుండగా.. విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా తానేం చేయాలన్న దానిపై క్లారిటీతో.. ఒక ప్రణాళిక ద్వారా వెళ్లటం కనిపిస్తుంటుంది.
బాబు బ్యాచ్ తీరు గమనిస్తే.. జగన్ ప్రకటించే ప్రకటనలకు కౌంటర్ గా హడావుడి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కనిపిస్తుందే తప్పించి.. హోదా సాధన ముఖ్యమన్నట్లుగా కనిపించదు. ముందు నుంచి ప్రకటించిన చందంగానే ఈరోజు లోక్ సభ నిరవధికంగా వాయిదా పడిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ ను కలిసి రాజీనామా ఫార్మాట్ లో తమ రాజీనామా పత్రాల్ని సమర్పించారు. అనంతరం ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు ఏపీ భవన్‌కు వెళ్లారు.
ఇదిలా ఉంటే.. బాబు పార్టీ ఎంపీలు మాత్రం అందుకు భిన్నంగా మీడియా దృష్టిని ఆకర్షించేలా నిరసనలు చేపడుతుండటం గమనార్హం. ఇలాంటివేళ.. జగన్ సంచలన సవాల్‌ను విసిరారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఊపిరి ఆడనివ్వని రీతిలో ఆయన సవాల్ ఉంది.
హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేసిందని.. తాము ముందే చెప్పినట్లుగా రాజీనామాలు చేసినట్లుగా ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలతో కలిసి నడవాలనే ఉద్దేశమే ఉంటే టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించాలని సవాల్ విసిరారు.
తాను చెప్పిందే చేశానని.. తమ ఎంపీలతో రాజీనామా లేఖల్ని సమర్పించామని.. మరి.. బాబు కూడా తన ఎంపీలతో ఆ పని చేయించగలరా? అంటూ సవాల్ విసిరారు. జగన్ తాజా సవాల్ బాబుకు బీపీ పెంచేదిగా మారుతుందనటంలో సందేహం లేదు. బాబు హయాంలో జరిగిన అవినీతిపై మోడీ సర్కారు నజర్ వేసిందని.. ఎంపీలు రాజీనామా చేసిన పక్షంలో.. బాబుపై కేసులు నమోదైతే.. ఆ వైనాన్ని లోక్ సభలో నిరసనల రూపంలో వినిపించేందుకు ఎంపీలు అవసరమన్నట్లుగా బాబు ఉన్నట్లు చెబుతున్నారు.
కారణం ఏమైనా.. బాబు ఎంపీలు రేపొద్దున రాజీనామా చేసినా.. అదంతా జగన్ ఒత్తిడి కారణమే అవుతుందే తప్పించి.. బాబు సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదన్నది ఏపీ ప్రజలు గుర్తుంచుకుంటారు. ఏ మైలేజీ కోసం కిందా మీదా పడుతున్నారో బాబు.. చివరకు అదేదీ దక్కని పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పక తప్పదు.