Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తిలో వ‌ర్షం..జ‌గ‌న్ చాంబ‌ర్‌ లోకి నీళ్లు

By:  Tupaki Desk   |   6 Jun 2017 2:12 PM GMT
అమ‌రావ‌తిలో వ‌ర్షం..జ‌గ‌న్ చాంబ‌ర్‌ లోకి నీళ్లు
X
ఏపీ రాజధాని అమరావతి సచివాలయం పరిసరాల్లో వర్షం కురిసింది. సచివాలయం నాలుగో బ్లాక్లోకి వర్షపునీరు వచ్చి చేరింది. ఏపీ అసెంబ్లీలోని ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఛాంబ‌ర్‌లోకి వ‌ర్షం నీరు చేరి, పైక‌ప్పు ఫ్లెక్సీలు ఊడిపోయిన‌ట్లు మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త రాజ‌కీయ వర్గాల్లో క‌ల‌క‌లం సృష్టించింది. రాజ‌ధాని ప్రాంతం ఎంపిక, నిర్మాణం విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం వైఖ‌రి కార‌ణంగానే ఇలా జ‌రుగుతోందని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ ప‌రిణామంపై ప్ర‌తిప‌క్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిప‌డింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాస‌న మండ‌లి ప‌క్ష నేత ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు మీడియాతో మాట్లాడుతూ రాజ‌ధాని నిర్మాణానికి ఈ ప్రాంతం అనుకూలం కాద‌ని ఎందరు చెప్పినా విన‌కుండా చంద్ర‌బాబు అనాలోచితంగా క‌ట్టిన ఫ‌లితంగానే ఇవాళ అసెంబ్లీలోకి నీరు వ‌చ్చింద‌ని మండిప‌డ్డారు. కొండ‌వీటి వాగు ముంపు ఉంటుంద‌ని శివ‌రామ‌కృష్ణ క‌మిటీ కూడా ముందే చెప్పింద‌ని తెలిపారు. ఇక్క‌డ బిల్డింగ్ క‌ట్ట‌డానికి వీలుప‌డ‌ద‌ని గ్రీన్ ట్రిబ్యూన‌ల్ కోర్టు చెప్పినా ఖ‌త‌రు చేయ‌లేదని గుర్తు చేశారు. ఇటీవ‌ల జాతీయ మ‌హిళా స‌ద‌స్సు నిర్వ‌హించిన సంద‌ర్భంలో కూడా వ‌ర్షం కుర‌వ‌డంతో తాత్కాలిక స‌చివాల‌యానికి రాక‌పోక‌లు నిలిచిపోయాయ‌ని ఉమ్మారెడ్డి గుర్తు చేశారు. మ‌హిళ‌లు బ‌య‌ట‌కి వెళ్ల‌లేద‌ని చెప్పారు. ఐదు బ్లాక్‌లు క‌లిసి రూ.1300 కోట్లు ఖ‌ర్చు చేశార‌ని, ఒక్క వ‌ర్షానికే అసెంబ్లీ మునిగిపోయింద‌న్నారు. ప్ర‌తిప‌క్ష నేత చాంబ‌ర్ నీట మునిగింద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఆరు నెల‌ల్లో పూర్తి చేసే ప‌నికిరాని భ‌వ‌నం ఎవ‌రికి కావాలని ఉమ్మారెడ్డి ప్ర‌శ్నించారు. అనాలోచితంగా క‌ట్టిన ఫ‌లిత‌మే ఇవాళ ఇలాంటి సంఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని, దీనికి చంద్ర‌బాబు ఏం స‌మాధానం చెబుతార‌ని ప్ర‌శ్నించారు.

ఒక్క వ‌ర్షానికి బ‌క్కెట్ల‌తో నీళ్లు తోడుకోవాల్సిన దుస్థితి నెల‌కొందంటే రాజధాని నిర్మాణంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థ‌మ‌వుతుంద‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి వాసిరెడ్డి ప‌ద్మ అన్నారు. ఒక్క వ‌ర్షానికే తాత్కాలిక స‌చివాల‌యంలోకి నీరు చేరడం ద్వారా చంద్ర‌బాబు అవినీతి బ‌య‌ప‌డింద‌ని మండిప‌డ్డారు. అవినీతిని బ‌య‌ట‌పడుతుంద‌నే భ‌యంలో మీడియాను అనుమంతించ‌కుండా ప్ర‌భుత్వం మ‌భ్య‌పెడుతోందని అన్నారు. ఇది రాష్ట్రానికి అవ‌మాన‌క‌రమ‌ని అన్నారు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/