Begin typing your search above and press return to search.

ఆ పదవికి జగన్ ఎవరినీ ఎంపిక చేస్తారో.. నేతల్లో టెన్షన్

By:  Tupaki Desk   |   31 May 2019 10:20 AM GMT
ఆ పదవికి జగన్ ఎవరినీ ఎంపిక చేస్తారో.. నేతల్లో టెన్షన్
X
ముఖ్యమంత్రి్ గా జగన్ ప్రమాణ స్వీకారం ముగిసింది.. ఆ పాలన వ్యవహారాల్లో తలమునకలైపోయారు.. ఈ నెల 8న క్యాబినెట్ విస్తరణ కూడా జరగబోతోంది.. ఎవరికి కాల్ వస్తుందో .. ఎవరిపై జగనన్న అనుగ్రహం ఉంటుందోనని జిల్లాల్లో కొత్త, పాత నేతలు లెక్కలేసుకుంటున్నారు.. అలాగే ఆయా పార్టీల నేతల అనుచరులు అదే అంచనాలతో ఉన్నారు.. ఇంతట్లో స్పీకర్ పదవి కి ఎవరికి ఇవ్వాలో జగన్ కసరత్తు చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో రెండు మూడు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.. బాపట్ల ఎమ్మెల్యే కోనరఘుపతి ముందు వరుసలో ఉన్నారు.. అలాగే టీడీపీ ప్రభుత్వంలో స్పీకర్ గా ఉన్న కొడెల పై విక్టరీ సాధించిన అంబటి రాంబాబు, కొవ్వూరులో విజయం సాధించిన తానేటి వనిత పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి...

అయితే విచిత్రంగా స్పీకర్ పదవి స్వీకరించడానికి ముగ్గురు అయిష్టంగా ఉన్నారంటున్నారు.. మంత్రులుగా అవకాశం కల్పించాలని ఎన్నికైన కొత్త ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు గానీ స్పీకర్ పదవి తనకు వచ్చేటట్లు చూడమని ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని వాదన వినిపిస్తోంది... ముఖ్యంగా స్పీకర్ గా ఎంపికైతే.. హోదా దృష్ట్యా మంత్రుల్లో అన్నింటిలో ఇన్ వాల్వ్ అవ్వడానికి లేదు... ప్రజలకు అందుబాటులో ఉండటంలో కూడా ఇబ్బందులున్నాయి.. అంతకు మించి స్పీకర్ గా ఎన్నికైతే తరువాతి ఎన్నికల్లో ఓడిపోతామనే భయం వెంటాడుతోంది... ముఖ్యంగా తాజాగా చూసుకున్న కోడెల శివప్రసాద్ రావు, తెలంగాణ స్పీకర్ మధుసూధనాచారి ఓటమి చెందారు.. 2014లో అప్పటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఓడిపోయారు.. 2009లో స్పీకర్ సురేష్ రెడ్డి ఓటమి చెందారు.... ఆ భయం ప్రధానంగా వెంటాడుతోందంటున్నారు..

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పని చేసిన స్పీకర్లకు ఇదే అనుభవం ఎదురైంది. ముఖ్యంగా కోనరఘుపతి, అంబటి రాంబాబు పేర్లు వినిపిస్తున్నాయి.. 1989 నుంచి 94 వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన అంబటి రాంబాబు తిరిగి 30 ఏళ్లకి ఎమ్మెల్యేగా గెలుపొందారు.. మంచి వాగ్ధాటి, విషయ పరిజ్ఞానం ఉండటంతో స్పీకర్ గా ఎంపిక చేయరని అంబటి లెక్కలు వేసుకుంటున్నా..ఆయనకున్న బలాలే జగన్ ఆయన్ను స్పీకర్ గా ఎంపిక చేయడానికి ఉసిగొల్పుతున్నాయంటున్నారు.. మరో వైపు కోన రఘుపతి , మహిళలకు ఇస్తే కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనిత పేర్లు వినిపిస్తున్నాయి.. కానీ స్పీకర్ గా ఉండడని జగనన్న నుంచి ఎవ్వరికి ఫోన్ వస్తుందోనన్న భయంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారంటున్నారు...