Begin typing your search above and press return to search.
కేబినెట్ పై క్లారిటీతో జగన్... ఫస్ట్ ఫోన్ కాల్ ఆయనకే
By: Tupaki Desk | 6 Jun 2019 12:33 PM GMTఏ పనినీ జగన్ ఆలస్యం చేయదలచుకోలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి జగన్... 8వ తేదీన కేబినెట్ ను ఏర్పాటుచేయాలని, ఆరోజే తొలి మీటింగ్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఎవరిని కేబినెట్లోకి తీసుకోవాలనే విషయమై జగన్ ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఇక ఎంపిక చేసిన వారికి జగన్ స్వయంగా ఫోన్ చేసి సర్ ప్రైజ్ చేస్తున్నారు. అలా తొలి ఫోన్ కాల్ కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుకు చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.
ముఖ్యమంత్రి నుంచి విజయవాడకు పిలుపు రాగానే తన కీలక అనుచరగణంతో కొరముట్ల రాజధానికి బయలుదేరి వెళ్లారు. జగన్ కి వంద మార్కులు వేసిన నాలుగు జిల్లాలలో కడప ఒకటి. రాష్ట్రంలో ఇలాంటి జిల్లాలు నాలుగు ఉన్నాయి. అన్ని సీట్లు ఇచ్చిన సొంత జిల్లాకే జగన్ తొలి ప్రాధాన్యం ఇచ్చారు. ఇక తమ నేతకు మంత్రి పదవి ఖాయమనే ఫీలర్ రావడంతో కొరముట్ల అనుచరులు, వైసీపీ కార్యకర్తలు నియోజకవర్గ కేంద్రంలో భారీ ఎత్తున హడావుడి చేశారు. బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నాు.
మంత్రి పదవులకు జగన్ మంచి లెక్కలు వేస్తున్నట్టున్నారు. జగన్ ఎంపిక చేసినట్లు బయటకు వచ్చిన తొలి వ్యక్తి కొరముట్లే. ఆయన రైల్వేకోడూరు నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. 2019 ఎన్నికల్లో ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి నర్సింహప్రసాద్ పై శ్రీనివాసులు అత్యధిక మెజార్టీతో గెలుపొందారు.
శ్రీనివాసుతో పాటు కొడాలి నాని, అనిల్ యాదవ్, బొత్స కుటుంబం నుంచి ఒకరు, పిన్నెల్లి, బాలినేని శ్రీనివాసరెడ్డి, అనంత వెంకట్రామి రెడ్డి, ప్రకాష్ రెడ్డి తదితరులు వెయిటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. గోదావరి జిల్లాకు నాలుగు మంత్రి పదవులు, ఉత్తరాంధ్రకు నాలుగు పదవులు, రాయలసీమకు ఆరు మంత్రి పదవులు దక్కనున్నాయి.