Begin typing your search above and press return to search.

నాడు వైఎస్.. నేడు జగన్.. అదే తీరు..

By:  Tupaki Desk   |   15 July 2019 11:41 AM GMT
నాడు వైఎస్.. నేడు జగన్.. అదే తీరు..
X
ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టగానే జెట్ స్పీడ్ తో నిర్ణయాలు తీసుకుంటూ సంచలనాలకు వేదిక అవుతున్నారు వైఎస్ జగన్. ఇప్పటికే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి.. వాటిని అమల్లోకి తీసుకొచ్చి ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్నారు. అయితే ఉత్తరాంధ్ర సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణమవుతున్న మావోయిస్టులపై జగన్ డేరింగ్ స్టెప్ వేశారు.

వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా మావోయిస్టులను చర్చల పేరుతో ఆహ్వానించి ఒక గొప్ప స్నేహహస్తాన్ని చాటారు. ఇప్పుడు వైఎస్ కూడా తండ్రి బాటలోనే మావోయిస్టులపై కేబినెట్ సబ్ కమిటీ వేయడం విశేషం.

చంద్రబాబు ప్రభుత్వం చివరి ఏడాదిలో మావోయిస్టులు అరకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిడారి సోము,ఆయన అనుచరుడిని హత్యచేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మైనింగ్ మాఫియాను పెంచి పోషించినందుకే ఈ హత్య జరిగిందని ఆరోపణలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం తాజాగా మావోయిస్టుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారి సమస్యలపై ఏపీ ప్రభుత్వం తాజాగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం విశేషం. ఈ కమిటీ పలు అంశాలపై చర్చించి నిర్నయాలు తీసుకోనుంది. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పించడంతోపాటు మావోల దాడుల్లో దెబ్బతిన్న ఆస్తులను పునర్మిర్మించడం తదితర విషయాలపై కమిటీ చర్చించనుంది.

ఏపీ ప్రభుత్వం సోమవారం ఈ మేరకు మావోయిస్టుల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మావోయిస్టుల నియంత్రణ, వారి సమస్యలపై ఈ కేబినెట్ సబ్ కమిటీ చర్చిస్తుందని తెలిపింది. ఈ కమిటీకి చైర్మన్ గా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉంటారు. కమిటీలో సభ్యులుగా హోంమంత్రి- గిరిజన- రెవెన్యూ- ఆర్ అండ్ బీ మంత్రులకు చోటు కల్పించారు.