Begin typing your search above and press return to search.
ఈ నిర్ణయంతో జగన్ చరిత్రలో నిలిచిపోయారు
By: Tupaki Desk | 10 July 2019 8:36 AM GMT2014 నుంచి ఇప్పటివరకు ఆత్మహత్య చేసుకున్న రైతులందరికీ ఒక్కొక్కరికి రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని జగన్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఈ సంచలన నిర్ణయంతో తమది రైతు ప్రభుత్వమని చెప్పకనే చెప్పారు.
బుధవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఏపీ సీఎం జగన్ రైతుల ఆత్మహత్యలకు పరిహారం పూర్తి స్థాయిలో అందకపోవడం.. చంద్రబాబు పాలనలో న్యాయం జరగకపోవడంపై స్పందించారు.
2014 నుంచి ఇప్పటివరకు ఏపీ వ్యాప్తంగా 1513 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు జగన్ కు అధికారులు నివేదిక సమర్పించారు. ఇందులో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 391 మందికి మాత్రమే పరిహారం ఇచ్చారని తెలిపారు. మిగతా రైతులకు సాయం అందక వారి కుటుంబాలు అవస్థలు పడుతున్నాయని అధికారులు నివేదించారు.
దీనిపై ఆవేదన వ్యక్తం చేసిన జగన్ అన్నం పెట్టే అన్నదాతల రుణం తీర్చుకోవాలని నిర్ణయించారు. వెంటనే మిగిలిన రైతులందరికీ ఒక్కొక్కరికి రూ.7 లక్షల చొప్పున పరిహారం వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. అర్హులైన రైతుల కుటుంబాల వద్దకు వెళ్లి మరీ చెక్కులను అందించాలని అధికారులను ఆదేశించారు.
జగన్ రైతుపక్షపాతిగా తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. చనిపోయిన రైతు కుటుంబాలకు 7 లక్షల తక్షణ సాయంపై రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.