Begin typing your search above and press return to search.
ఢిల్లీ టూర్...జగన్ లో కొత్త హుషార్
By: Tupaki Desk | 29 Dec 2022 5:30 PM GMTమూడు రోజుల పాటు ఢిల్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జరిపిన టూర్ విజయవంతం అయిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. జగన్ సైతం ఫుల్ జోష్ మీద ఉన్నారు అని అంటున్నారు. ఈ టూర్ లో ఆయన కేంద్రంలోనూ బీజేపీలోనూ కీలకమైన ఇద్దరు నాయకులు ప్రధాని మోడీ హోం మంత్రి అమిత్ షాలతో జగన్ భేటీ అయి అనేక అంశాలను చర్చించారు.
ఈ భేటీ సందర్భంగా రాజకీయపరమైన అంశాలు కూడా అనేకం చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో రాజకీయ సమీకరణలు పొత్తుల విషయంలో ఒక అంచనాను కూడా జగన్ వారి భేటీ ద్వారా రూపొందించుకున్నారని అంటున్నారు. ఇక సీఎం జగన్ ప్రధానితో సమావేశం తరువాత అన్ని అంశాలు చర్చించామని న.సానుకూలంగా స్పందించారని ఒక ట్వీట్ చేసారు.
అదే విధంగా చూస్తే ప్రధానితో నలభై అయిదు నిముషాల పాటు సమావేశం జరిపిన జగన్ అమిత్ షాతో నలభై అయిదు నిముషాల పాటు చర్చలు జరిపారు. ఏపీలో పొత్తుల కోసం విపక్షాలు గట్టిగా చూస్తున్నాయి. బీజేపీని తమతో కలుపుకుని పోవాలని కూడా ఆలోచిస్తున్నాయి.
దాంతో బీజేపీ మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం అయితే జగన్ చేశారు అని అంటున్నారు. తెలంగాణాలో ఈసారి అధికారం మీద బీజేపీ ఆశలు పెట్టుకుంది. దాని కోసం అందివచ్చిన అవకాశాలు అన్నీ కూడా పరిశీలిస్తోంది. ఇదే అదనుగా తెలంగాణాలో ఎంట్రీ ఇచ్చిన చంద్రబాబు అక్కడ బీజేపీతో పొత్తులను ఖరారు చేయడానికి చూడడం ద్వారా ఏపీలో కూడా విస్తరించాలని చూస్తున్నారు.
ఏపీలో జనసేన బీజేపీతో కలసి పోటీ చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. అయితే బీజేపీ తెలంగాణా నేతలు మాత్రం తెలుగుదేశం, బీజేపీలతో పొత్తులు వద్దు వద్దనే అంటున్నారు. అయితే తుది నిర్ణయం మాత్రం కేంద్ర నాయకత్వానిదే. అంటే మోడీ, అమిత్ షాలదే. దాంతో వారి మదిలో ఏమి ఉంది అన్నది జగన్ ఢిల్లీ టూర్ లో తెలుసుకునే ప్రయత్నం చేశారని అంటున్నారు.
అధికారిక అంశాలతో పాటు రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చాయని అంటున్నారు. ఆ విధంగా ఇండైరెక్ట్ గా అన్యాపదేశంగా వచ్చిన రాజకీయ చర్చలలో ఏపీకి సంబంధించి వైసీపీ రాజకీయానికి అనుకూలంగానే కేంద్ర బీజేపీ పెద్దలు వ్యవహరిస్తారు అన్న ధీమా అయితే జగన్ లో కనిపించింది అని అంటున్నారు ఇక ఏపీకి సంబంధించి చూస్తే అనేక విభజన హామీలను కేంద్ర పెద్దల వద్ద ప్రస్తావించిన జగన్ పరిపాలనా వికేంద్రీకరణ అంశం అయిన విశాఖ పాలనా రాజధాని గురించి కూడా ప్రధాని దృష్టిలో ఉంచారని అంటున్నారు.
అన్నీ అనుకూలిస్తే వచ్చే మార్చిలోగా విశాఖ నుంచి రాజధాని కార్యకలాపాలు నిర్వహించాలని జగన్ చూస్తున్నారు అని తెలుస్తోంది. దానికి కేంద్ర పెద్దల ఆమోదం ఉంటే తన కల సాకారం అవుతుంది అన్న అజెండాతోనే జగన్ వారి దృష్టిలో పెట్టారు అని అంటున్నారు. అదే టైం లో జగన్ ప్రస్థావించిన అనేక అంశాలకు కేంద్ర పెద్దల నుంచి సపోర్ట్ లభించింది అని అంటున్నారు. జగన్ మచిలీపట్నంలో పోర్టుతో పాటు కడప స్టీల్ ప్లాంట్ అంశాన్ని కూడా కేంద్ర పెద్దల దృష్టిలోకి తెచ్చారని దానికి కూడా మద్దతు లభిస్తుంది అన్న ఆశతో ఉన్నారని అంటున్నారు.
మొత్తానికి చూస్తే వచ్చే ఎన్నికల్లో మరో మారు గెలవాలన్న జగన్ ఆలోచనలు వైసీపీ వ్యూహాలకు తగిన విధంగానే ఢిల్లీ టూర్ పూర్తి సంతృప్తిగా సాగింది అని అంటున్నారు. జగన్ టూర్ సక్సెస్ అయిందన్న మాట అయితే వైసీపీ శ్రేణులలో కనిపిస్తోంది. దాంతో రానున్న రోజులల్లో జగన్ దూకుడు ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.