Begin typing your search above and press return to search.

జగన్ భావోద్వేగం: మహిళలకు మేనమామగా గర్వపడుతున్నా

By:  Tupaki Desk   |   8 Feb 2020 8:50 AM GMT
జగన్ భావోద్వేగం: మహిళలకు మేనమామగా గర్వపడుతున్నా
X
మహిళలు, బాలల సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో మహిళలు, బాలాబాలికలకు తాను మేనమామగా ఏపీ సీఎం జగన్ అభివర్ణించుకుంటారు. అందులో భాగంగా మహిళలు, బాలల సంరక్షణకు చర్యలు చేపట్టారు. దేశంలోనే తొలి సారిగా దిశ చట్టాన్ని తీసుకువచ్చి మహిళలపై దాడికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించేందుకు చర్యలు తీసుకున్నారు. జగన్ మరో ముందడుగు వేసి మహిళల కోసం ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్ ల ఏర్పాటుకు నిర్ణయించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దిశ పోలీస్ స్టేషన్ ను శనివారం జగన్ ప్రారంభించారు.

ఈ దిశ స్టేషన్ లో డీఎస్పీలు, సీఐలు ఇద్దరు, ఐదుగురు ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లతో కలిపి మొత్తం 52 మంది పోలీస్‌ సిబ్బంది ఉంటారు. దిశ చట్టంపై అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐఏఎస్‌ అధికారిణి కృతికా శుక్లా, ఐపీఎస్‌ అధికారి దీపికను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఈ చట్టంతో పాటుగా ఏపీ సర్కార్ రాష్ట్రంలో దిశ పేరుతో పోలీస్ స్టేషన్లను కూడా ఏర్పాటు కు చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా రాష్ట్రంలో తొలి దిశ పోలీస్ స్టేషన్ ను రాజమండ్రిలో ఏర్పాటుచేశారు. దీన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అంతకు ముందు మహిళల సంరక్షణ కోసం ప్రత్యేక యాప్ ఆవిష్కరించారు.మహిళలు, బాలల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు.

అయితే ఆంధ్రప్రదేశ్‌ లో ప్రవేశ పెట్టిన దిశ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామని ఢిల్లీ, మహారాష్ట్ర ప్రకటించాయి.