Begin typing your search above and press return to search.

వివేక హత్యపై వైఎస్ జగన్ పిటిషన్

By:  Tupaki Desk   |   20 March 2019 4:15 AM GMT
వివేక హత్యపై వైఎస్ జగన్ పిటిషన్
X
తన బాబాయ్ , మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో హై కోర్టును ఆశ్రయించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ధర్యాప్తు పై తమకు నమ్మకం లేదని.. ఈ విషయంలో స్వతంత్ర విచారణను కోరుతున్నట్టుగా జగన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ మేరకు హై కోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.

వివేకానందరెడ్డి హత్య కేసును చిన్నదిగా చూపేందుకు ఏపీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారని జగన్ తన పిటిషన్లో పేర్కొన్నట్టుగా సమాచారం. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు ఈ కేసును వాడుకొంటూ ఉన్నారని జగన్ అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణతో వాస్తవాలు తేలవనేది జగన్ వాదనగా తెలుస్తోంది. కాబట్టి ఈ కేసు విచారణను ఇండిపెండెంట్ బాడీకి అప్పగించాలని జగన్ కోరుతున్నారు.

ఈ కేసులో పలువురుని ప్రతివాదులుగా పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు - ఏపీ డీజీపీ - కేంద్ర ప్రభుత్వం - సీబీఐ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వ ఆధీనంలో లేని స్వచ్ఛంద సంస్థ విచారణను కోరుతున్నట్టుగా పేర్కొన్నారు.

ఈ కేసులో సీబీఐ విచారణను డిమాండ్ చేస్తూ ఇప్పటికే హై కోర్టులో ఒక పిటిషన్ దాఖలు అయ్యింది. తటస్థ వ్యక్తుల నుంచి ఆ పిటిషన్ దాఖలు అయ్యింది.