Begin typing your search above and press return to search.

జగన్ ఆ పదిరోజులు.. వైసీపీలో ఉత్కంఠ

By:  Tupaki Desk   |   2 Aug 2019 6:55 AM GMT
జగన్ ఆ పదిరోజులు.. వైసీపీలో ఉత్కంఠ
X
జగన్ రాకతోనే వైసీపీలో పండుగ వాతావరణం నెలకొనబోతోందట.. ఈ మేరకు ఏపీ సచివాలయంలో చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయట.. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లిపోయారు. వ్యక్తిగత పర్యటన కోసం నాలుగు రోజులపాటు కుటుంబంతో కలిసి వెళ్లారు. ఆగస్టు 5న జగన్ తిరిగి ఏపీకి రానున్నారు..

ఇక ఏపీ సీఎం జగన్ ఈనెల 15న అమెరికా పర్యటన పెట్టుకున్నారు. అక్కడ వివిధ సమావేశాలు., ఏపీ పెట్టుబడులను ఆకర్షించే పనిలో పడ్డారు. జగన్ అమెరికా వెళ్లే లోపే ఏపీలో ఆశావహుల కోరిక తీర్చబోతున్నారని సమాచారం.

ఈ గ్యాప్ లో అంటే 5నుంచి 15వ తేదీ మధ్యలో ఏపీలో పండుగ వాతావరణం నెలకొనేలా జగన్ అంతా సిద్ధం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. నామినేటెడ్ పోస్టులను పెద్ద ఎత్తున భర్తీ చేస్తున్నారని ఈ మేరకు ప్రతిపాదనలను అధికారులు రూపొందిస్తున్నారని ఏపీ సచివాలయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అంటే 10రోజుల్లో ఈ నామినేటెడ్ నియామకాలను పెద్ద ఎత్తున భర్తీ చేసేందుకు జగన్ నిర్ణయించారని సమాచారం.

ఏపీలో అఖండ మెజార్టీ సాధించడం.. 151మంది గెలవడంతో సామాజిక సమీకరణాలతో సీనియర్లకు మంత్రి పదవులు ఇవ్వలేకపోయారు జగన్. అందుకే నామినేటెడ్ పోస్టులను కట్టబెట్టేందుకు ఇప్పుడు రంగం సిద్ధం చేశారట.. ఇప్పటికే రోజాకు ఏపీఐఐసీ చైర్మన్, వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్, నటుడు ఫృథ్వీకి ఎస్వీబీసీ చైర్మన్ పదవులను జగన్ కట్టబెట్టారు. ఇప్పుడు తాజాగా భారీగా నామినెటెడ్ పదవుల భర్తీని ఈనెల 15లోపు జగన్ అమెరికా వెల్లే లోపే నియమించాలని డిసైడ్ అయినట్టు సమాచారం.

తాజాగా ఎఫ్.డీ.సీ చైర్మన్ గా అలీని నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు మాత్రం వెల్లడికాలేదు. అలీకి ఉత్తర్వులతోపాటు నామినేటెడ్ పోస్టులను జగన్ భర్తీ చేయబోతున్నారట.. వైసీపీ నేత రాజశేఖర్ ను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించబోతున్నాడట.. బ్రహ్మణ, ఇతర సామాజికవర్గాల కార్పొరేషన్ల చైర్మన్లను జగన్ ప్రకటించబోతున్నట్టు సమాచారం. ఇవే కాదు కార్పొరేషన్లు, వివిధ సహకార సంఘాలు, ఆలయాల కమిటీలు ఇలా అన్నింటికి జగన్ పదవుల పందేరానికి రెడీ కావడంతో ఆశావహుల్లో సందడి నెలకొంది. దీంతో వైసీపీలో పదవుల పండుగ మొదలైనట్టు కనిపిస్తోంది.