Begin typing your search above and press return to search.
జ'గన్' ఫైర్:ఆర్టీసీని జేసీకి..కాలేజీల్ని నారాయణకా?
By: Tupaki Desk | 1 May 2017 7:23 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుంటూరు బస్టాండ్ వద్ద మేడే ఉత్సావాల్లో పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన ఆయన.. చంద్రబాబు పాలనపై సునిశిత విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనపై రాష్ట్రంలోఎవరూ సంతృప్తికరంగా లేరని.. అందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా కీలక విమర్శలు చేశారు జగన్. ఎపీఎస్ ఆర్టీసిని జేసీ దివాకర్ రెడ్డికో.. కేశినేని నానికో అమ్మేయటానికి బాబు సిద్ధంగా ఉన్నారని.. రేషనలైజేషన్ పేరుతో కాలేజీలన్నింటినీ ఒక పద్ధతి ప్రకారం మూసేస్తున్నట్లుగా మండిపడ్డారు.
కాస్త వీలుంటే ఆ కాలేజీల్ని నారాయణకు ఇచ్చేయటానికి సిద్ధపడుతున్నారన్నారు. ఇంకాస్త వీలు కనిపిస్తే.. ఏపీ జెన్‌కోను.. ట్రాన్స్ కోను కూడా ఏ సీఎం రమేష్ కో.. సుజనా చౌదరికో చంద్రబాబు అమ్మేయటానికి సిద్ధపడతారన్నారు. బాబు తీరుతో కార్మికుల్లో అభద్రతాభావం అంతకంతకూ పెరుగుతుందన్న ఆయన.. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవాన్ని ఒక పండుగగా చేసుకుంటామని.. ఏ దేశమైనా కార్మికులంతా ఒక్కటేనని చెప్పే రోజు ఇదేనన్నారు. కాంట్రాక్టు కార్మికులను.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని పర్మినెంట్ చేస్తానని చెప్పిన చంద్రబాబు.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్ని.. తుంగలోకి తొక్కారన్నారు. పిల్లను ఇచ్చిన మామను ఏ విధంగా అయితే వెన్నుపోటు పొడిచారో.. అదే తీరులో కాంట్రాక్ట్.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని వెన్నుపోటు పొడిచారంటూ మండిపడ్డారు. అందరూ కలిసికట్టుగా చంద్రబాబు దుష్ట పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందంటూ జగన్ పిలుపునిచ్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/