Begin typing your search above and press return to search.

గెలిస్తే సక్రమం.. ఓడితే అక్రమమా బాబూ

By:  Tupaki Desk   |   16 April 2019 8:44 AM GMT
గెలిస్తే సక్రమం.. ఓడితే అక్రమమా బాబూ
X
తను గెలిస్తే అంతా సక్రమం.. ఓడిపోతే అక్రమం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. పోలింగ్ రోజున చెలరేగిన హింస గురించి గవర్నర్ నరసింహన్ కు జగన్ మంగళవారం ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాబు తీరుపై నిప్పులు చెరిగారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నెగ్గింది ఈవీఎంలతోనేనని.. కనీసం వీవీ ప్యాట్స్ కూడా అప్పుడు లేవని తెలిపారు. ఈ సారి కనీసం వీవీ ప్యాట్స్ అయినా ఉన్నాయని.. ఎవరికి ఓటు వేశామో తెలుసుకుంటున్నామని తెలిపారు.

గత ఎన్నికల్లోనూ.. నంద్యాల ఉప ఎన్నికలప్పుడు బాగా పనిచేసిన ఈవీఎంలు ఇప్పుడు బాబుకు చెడ్డవి అయిపోయావా అని ప్రశ్నించారు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.ఈవీఎంల విషయంలో అంతా పారదర్శకంగానే ఉందని.. మాక్ పోలింగ్ రూపంలో యాభైఓట్లను వేసిన తర్వాత అక్కడున్న అన్ని పార్టీల ఏజెంట్ల సంతకాలతోనే పోలింగ్ మొదలు పెట్టారని వివరించారు. ఈ ప్రాథమిక విషయాలను పక్కనపెట్టి చంద్రబాబు రాద్ధాంతం చేశాడని జగన్ ఆరోపించారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఈవీఎంల మీద నెపాన్ని నెట్టి రాద్దాంతం చేస్తున్నాడని ఆరోపించాడు.

కోడెల శివప్రసాద్ పోలింగ్ బూత్ లోకి దూరి తలుపులు మూసి చొక్కా చించుకొని రాద్ధాంతం చేశారని జగన్ ఆరోపించారు. వైసీపీ అభ్యర్థుల మీద కూడా పలుచోట్ల దాడులు జరిగాయని అన్నారు. ఆ విషయంలో కేసులు నమోదు చేయడం లేదన్నారు.

చంద్రబాబు నాయకుడు ఎన్నికల ముందు ఒకే కులానికి చెందిన వారికి ప్రమోషన్లు ఇచ్చి వారిని ఉపయోగించుకున్నాడని జగన్ ధ్వజమెత్తారు. గెలిచినప్పుడు మంచివైన ఈవీఎంలు.. ఓటమి తప్పదన్నప్పుడు చెడ్డవి అవుతాయా అని చంద్రబాబును ప్రశ్నించాలని విలేకరులకు సూచించారు జగన్.