Begin typing your search above and press return to search.

ముఖ్య‌మంత్రి హోదాలో జ‌గ‌న్ చేసిన ప‌నికి ప్ర‌శంస‌ల వ‌ర్షం

By:  Tupaki Desk   |   16 Aug 2019 5:22 AM GMT
ముఖ్య‌మంత్రి హోదాలో జ‌గ‌న్ చేసిన ప‌నికి ప్ర‌శంస‌ల వ‌ర్షం
X
ఆయన రాష్ట్రానికే ముఖ్యమంత్రి. ఆయన చుట్టూ ఐపీఎస్- ప్రభుత్వ అధికారులు ఉన్నారు. జ‌స్ట్ ఒక ఆర్డ‌ర్ వేస్తే చాలు ప‌క్కన ఉన్న వారు ఏ ప‌ని అయినా అమ‌లు చేసేందుకు సిద్ధంగా ఉంటారు. అయితే తాను ముఖ్య‌మంత్రిని అన్న ద‌ర్పం లేకుండా జ‌గ‌న్ సంద‌ర్భానుసారంగా వ్య‌వ‌హ‌రించిన తీరుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌లు అంద‌రూ పార్టీల‌తో సంబంధం లేకుండా సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే గురువారం గురువారం విజ‌య‌వాడ‌లోని ఇందిరాగాంధీ మునిసిప‌ల్ స్టేడియంలో 73వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు నిర్వ‌హించారు. సీఎం హోదాలో తొలిసారి ఈ వేడుక‌ల్లో పాల్గొన్న జ‌గ‌న్ జెండా వంద‌నం త‌ర్వాత పోలీసుల‌కు విశిష్ట సేవా ప‌త‌కాలు అంద‌జేశారు. ఈ క్ర‌మంలోనే ఓ పోలీస్ అధికారికి ప‌త‌కాన్ని అలంక‌రించే క్ర‌మంలో ఆయ‌న ముఖ్య‌మంత్రికి సెల్యూట్ చేస్తుండ‌గా అది జారి కింద ప‌డింది.

దీనిని గ‌మ‌నించ‌కుండా ఆ అధికారి క‌వాతు చేస్తూ ముందుకు వెళ్లిపోయారు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన జ‌గ‌న్ కింద‌ప‌డిన ఆ ప‌తాకాన్ని వంగితీసి ప‌క్క‌నే ఉన్న మ‌రో అధికారికి ఇచ్చారు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అయ్యింది. దీంతో నెటిజ‌న్లు ముఖ్య‌మంత్రి హోదాలో ఉండి కూడా అతి సామాన్య వ్య‌క్తిగా ఉంటున్నార‌ని... ఆయ‌న హుందాత‌నం మ‌రోసారి ప్ర‌ద‌ర్శించారు... యంగ్ అండ్ డైన‌మిక్ సీఎం అంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే జ‌గ‌న్ సీఎం అయ్యి మూడు నెల‌లు కూడా కాకుండానే ఆయ‌న ఖాతాలో మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. వీడీపీ అసోసియేట్స్‌ నిర్వహించిన సర్వేలో మోస్ట్‌ పాపులర్‌ సీఎంల జాబితాలో ఆయన మూడో స్థానంలో నిలిచారు. దేశవ్యాప్తంగా 71 శాతం మంది సీఎం జగన్‌ పాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నట్లు 'దేశ్‌ కా మూడ్‌' పేరిట చేపట్టిన సర్వేలో వ్య‌క్త‌మైంద‌ని వీడీపీ అసోసియేట్స్‌ వెల్లడించింది.