Begin typing your search above and press return to search.
అప్పుడు వైఎస్సార్.. ఇప్పుడు జగన్.. వాళ్లకే ప్రాధాన్యత
By: Tupaki Desk | 22 May 2019 12:38 PM GMTఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శకం ఎంతో ముఖ్యమైనది. ఆయన హయాంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 108, 104 సేవలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ సహా ఎన్నో కొత్త పథకాలు ప్రారంభమయ్యాయి. అవే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, పెండింగులో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయటం, జలయజ్ఞం సహా పలు కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం వంటివి రాజశేఖర్ రెడ్డిని రెండోసారి ఎన్నికల్లో గెలిచేలా చేశాయి. ఇప్పుడు ఇదే తరహా పాలన అందించాలన్న లక్ష్యంతో ఆయన కుమారుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు గురువారం వెలువడనున్నాయి.
ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో తమ పార్టీనే విజయం సాధిస్తుందన్న ధీమాతో ఉన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి. ఆయనే కాదు.. ఆ పార్టీలోని అందరూ ఈ ఎన్నికల్లో విజయం తమదేనన్న ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఎన్నికలకు ముందు పలు స్థానిక సంస్థలతో పాటు జాతీయ సర్వే సంస్థలు చేసిన సర్వేల్లో వైసీపీ విజయం సాధించబోతుందని తేలింది. అంతేకాదు, ఇటీవల వెలువడిన ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో కూడా మెజారిటీ సంస్థలు వైసీపీదే గెలుపని వెల్లడించాయి. దీంతో ఆ పార్టీ నేతలు అభ్యర్థుల్లో ఆనందం నెలకొంది. మరోవైపు, ప్రభుత్వ వ్యతిరేకత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఒక్కసారి అవకాశం ఇవ్వాలన్న బలమైన ఆకాంక్ష తోడు కావడంతో విజయం తప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఓ వార్త ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. ఎలాగూ విజయం తమదేనన్న ధీమాతో ఉన్న కొందరు నాయకులు అప్పుడే వైసీపీ అధినేతను కలిసి మంత్రి పదవుల కోసం సంప్రదింపులు జరుపుతున్నారట. వారిలో ముఖ్యంగా గతంలో వైఎస్ కేబినెట్ లో పని చేసిన ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, పార‌్ధసారధి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి వారు మంత్రి పదవుల కోసం ఇప్పటికే ఈ దిశగా లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ కూడా గతంలో తన తండ్రితో పాటు పని చేసిన వారు కావడంతో వీళ్లకే ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. మరికొందరు సీనియర్లకు మాత్రం నామినేటెడ్ పదవులు ఇచ్చి గౌరవించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.