Begin typing your search above and press return to search.
పవన్ కు జగన్ షాక్
By: Tupaki Desk | 17 March 2019 7:26 AM GMTజనసేనాని పవన్ కళ్యాణ్ కు షాక్ తగిలింది. జనసేన విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించి గేదెల శీనుబాబు తాజాగా జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. పవన్ కళ్యాణ్ పై అసంతృప్తితోనే గేదెల శీనుబాబు వైసీపీలో చేరినట్లు సమాచారం.
గేదెల శ్రీను ప్రముఖ పారిశ్రామికవేత్త.. స్వచ్ఛంద సేవకుడు. సేవా కార్యక్రమాలు చేస్తూ పవన్ దృష్టిలో పడ్డారు. జనసేన తరుఫున పోటీచేయడానికి దరఖాస్తు చేసుకోవడంతో పవన్ ఈయన స్టామినా తెలుసుకొని ఏకంగా విశాఖ ఎంపీ సీటును ఖరారు చేశారు.
కానీ గేదెల శ్రీను జనసేన టికెట్ పొందినా ప్రజల నుంచి ఆ పార్టీకి స్పందన లేకపోవడం.. మిగిలిన అభ్యర్థులు ఎవరో కూడా తెలియకపోవడం.. ప్రకటనలో జాప్యంతో జనసేన నుంచి వైదొలిగినట్లు సమాచారం.ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో అభ్యర్థుల ప్రకటనపై తమను సంప్రదించకుండానే పవన్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారంటూ ఇప్పటికే అక్కడి నేతలు అసంతృప్తితో ఉన్నారు. వారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పుడు ఎంపీ అభ్యర్థి కూడా అలాగే పార్టీని వీడి జనసేనానికి షాక్ ఇచ్చారు. ఇప్పుడు మరికొందరు కూడా జనసేన వీడేందుకు రెడీ అయ్యారట..
ఇక మరో సీనియర్ రాజకీయ విశ్లేషకులు.. పోలవరం ఉద్యమ నేత పెంటపాటి పుల్లారావు కూడా జనసేనలో గతంలో చేరారు. పవన్ ఈయనకు ఏలూరు ఎంపీ సీటును కేటాయించారు. ఈయన కూడా జనసేనను వీడి జగన్ సమక్షంలో వైసీపీలో చేరడం గమనార్హం.
ఇక టీడీపీ నెల్లూరు రూరల్ టికెట్ ఇచ్చినా కూడా ఆదాల ప్రభాకర్ వైసీపీ లో చేరడం టీడీపీని షాక్ కు గురిచేసింది. ఇక మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి , విశాఖ మాజీ ఎమ్మెల్యే ద్రోణం రాజు శ్రీనివాస్ కూడా వైసీపీలో చేరారు.మొత్తానికి ఎన్నికల వేళ వైసీపీ ఎత్తుగడలతో జనసేన కకావికలం అవుతోంది.