Begin typing your search above and press return to search.
ఏం ఫర్లేదు.. అలవాటు పడ్డారు సర్.. ఆ ఎంపీల వ్యాఖ్యలతో జగన్ ఖుషీ..!
By: Tupaki Desk | 21 Nov 2022 4:30 PM GMTపార్టీ అధినేతలకైనా.. ముఖ్యమంత్రి కైనా.. క్షేత్రస్థాయిలో తమవిషయంలో ప్రజలు ఎలా స్పందిస్తున్నా రు? ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? అనేది ఆసక్తిగా ఉంటుంది. ప్రజలు తమ గురించి పాజిటివ్‌గా రెస్పాన్స్ ఇస్తున్నారా? నెగిటివ్‌గా రెస్పాండ్ అవుతున్నారా? అనేది పాలకులుగా ఉన్న నాయకులు.. ముఖ్యంగా తరచుగా ప్రశ్నిస్తుంటారు. ఎక్కడికక్కడ.. ఎప్పటికప్పుడు.. సర్వేల పేరుతోనో.. మరో రూపంలో ప్రజల అభిప్రాయం తెలుసుకుంటారు.
ఈ క్రమంలో ఏపీలో అయితే.. మరింత ఎక్కువగా సర్వేలు సాగుతున్నాయి. ఒకవైపు.. ఐప్యాక్, మరోవైపు.. వలంటీర్లు.. ఇంకో వైపు గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా .. నాయకులు సేకరిస్తున్న అభిప్రాయం.. ఇలా ఏదైతేనేం.. మొత్తానికి వివిధ రూపాల్లో ప్రజల నుంచి అభిప్రాయాలు రోజూ ప్రభుత్వానికి చేరుతూనే ఉన్నాయి. ఒక్కొక్క సారి ప్రభుత్వానికి ఈ సర్వేలు షాకిస్తున్నాయి. మరికొన్ని సార్లు ఖుషీ పంచుతున్నాయి. సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వం హ్యాపీగానే ఉంది.
అయితే, పన్నుల పెంపు, కొత్తగా విధించిన చెత్తపన్ను, పెట్రోల్ ధరలు ఇలా.. కొన్నింటి విషయంలో మా త్రం ప్రజలు ఆగ్రహంతోనే ఉన్నట్టు ప్రభుత్వానికి తరచుగా నివేదికలు అందుతూనే ఉన్నాయి.
అయినా.. ప్రజలు అలవాటు పడతారులే.. అని సర్కారు భావిస్తూ వస్తోంది. కానీ, ఇప్పటి వరకు ఈ విషయంలో సర్కా రుకు ప్రజల నుంచి సానుకూల సంకేతాలు అయితే రాలేదు. మరోవైపు.. విపక్షాల దూకుడుతో ఈ విషయాలు ఎప్పుడూ.. చర్చకు వస్తూనే ఉన్నాయి.
కానీ, తాజాగా నాలుగు దిక్కుల నుంచి నలుగురు ఎంపీలను రప్పించుకున్న సీఎం జగన్.. మీ మీ ప్రాంతా ల్లో పరిస్థితి ఎలా ఉందని ఆరాతీశారట. ఈ క్రమంలో వారు.. అంతా ఓకే సర్! అని చెప్పారట. కానీ, అంత తేలిగ్గా వదిలే రకం కాదుకదా.. అందుకే.. మీమీ ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయాలను నివేదిక రూపంలో ఇవ్వాలని వారిని ఆదేశించారు. దీంతోసదరు ఎంపీలు... కొన్ని అభిప్రాయాలతోపాటు నివేదికలు కూడా పంపించారు.
వీటిలో.. ప్రధాన విషయం ఏంటంటే.. ప్రజలు కొత్త పన్నులకు అలవాటు పడిపోయారని.. మనకు ఇబ్బంది లేదని.. పేర్కొన్నారట. దీంతో సీఎం జగన్ కొంతమేరకు ఖుషీ అయ్యారని అంటున్నారు. మరి.. ఎన్నికల నాటికి కొత్తగా ఏమీ పెంచకపోతే.. వీటికి అలవాటు పడడం ఖాయమని వైసీపీ నాయకులు కూడా భావిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.