Begin typing your search above and press return to search.
రాజధాని సమస్యకు రెఫరండం పరిష్కారమవుతుందా?
By: Tupaki Desk | 25 Aug 2019 7:53 AM GMTరాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు ఒంటెత్తు పోకడలకు వెళ్లారనేది అందరూ ఒప్పుకున్న విషయం. రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు అన్ని కబుర్లు చెప్పినా ఆయన పార్టీ చిత్తుగా ఓడింది అంటే - కేవలం ఇరవై మూడు సీట్లకు మాత్రమే పరిమితం అయ్యిందంటే ఆయన రాజధానితో వ్యవహరించిన తీరునంతా ప్రజలు వ్యతిరేకించారు. గ్రాఫిక్స్ చూపించి ప్రజలను కన్వీన్స్ చేయాలని - వారిని భ్రమల్లో ముంచెత్తాలని చంద్రబాబు నాయుడు భావిస్తే ప్రజలు మాత్రం అదే రాజధాని మాత్రంలో చంద్రబాబు నాయుడు తనయుడిని కూడా ఓడించి వాస్తవం ఏమిటో చూపించారు. ఇప్పుడు రాజధాని మార్పు అనే ఊహాగానం విషయంలో తెలుగుదేశం పార్టీ చాలా ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే అది కేవలం తెలుగుదేశం పార్టీ ఆందోళన మాత్రమే! తెలుగుదేశం వీరాభిమానులు తప్ప మిగతా వారు ఆ విషయంలో పెద్దగా ఆందోళనతో లేరు అనే విషయాన్ని గమనించాలి.
ఇక రాజధాని ఒకే ప్రాంతానికి పరిమితం కావడం నయా జనరేషన్ కు నచ్చే విషయం ఏమీ కాదు. హైదరాబాద్ విషయంలో జరిగిన గొడవను అంతా గమనించే ఉంటారు. కాబట్టి మరోసారి అలాంటి పరిస్థితి రాకూడదంటే వికేంద్రీకరణ చాలా అవసరం. ఆ విషయాన్నే శిరామకృష్ణన్ కమిటీ కూడా చెప్పింది. అయితే అలాంటి మేధావుల నివేదికలను చంద్రబాబు నాయుడు బుట్టదాఖలు చేశారు.
ఇక ఇప్పుడు ఈ వ్యవహారాన్ని జగన్ ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందనేది ఆసక్తిదాయకంగా మారింది. ఇందుకు రెఫరండం కూడా ఒక పరిష్కారం అనే టాక్ వినిపిస్తోంది. అదే గనుక జరిగితే రాజధాని మార్పుకే ఎక్కువమంది ఓటేసే అవకాశం ఉంది. అటు రాయలసీమ ప్రజలు అక్కడ రాజధానికి పూర్తిగా వ్యతిరేకులు.
శ్రీబాగ్ ఒడంబడిక - కర్నూలు రాజధాని అనే మాట అక్కడి ప్రజల నుంచి వినిపిస్తోంది. ఇక ఉత్తరాంధ్రకు కూడా అమరావతి చాలా చాలా దూరమే. వారి ఆశలు విశాఖ మీదున్నాయి. ఇలా మెజారిటీ జిల్లాల ప్రజలు అమరావతికి వ్యతిరేకంగా వ్యవహరించే అవకాశాలున్నాయి. కాబట్టి రెఫరండం అంటూ వస్తే రాజధాని మార్పు ఖాయమైనట్టే. అలాగని ఏకాభిప్రాయం కుదరదు.
ఇలాంటి సమయంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వికేంద్రీకరణ మంత్రం పఠించడమే మేలని - రాయలసీమకు హై కోర్టు - విద్యాసంస్థలు తిరుపతికి - ఇండస్ట్రీలు దొనకొండకు - కొన్ని పరిశ్రమలు వైజాగ్ కు చేరవేసి పాలన అమరావతి నుంచి సాగించడం మంచిదనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి