Begin typing your search above and press return to search.
వారందరిని ఏపీకి తీసుకురావాలి..అధికారులకి ఆదేశాలు జారీచేసిన సీఎం!
By: Tupaki Desk | 4 May 2020 7:30 PM ISTకరోనా మహమ్మారి నివారణ చర్యలపై సోమవారం సీఎం జగన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్‌లు హజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రతి 10 లక్షల జనాభాకు 2,345 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10,229 పరీక్షలు నిర్వహించగా సోమవారానికి మొత్తం 1,25,229 పరీక్షలు నిర్వహించినట్లు సీఎం జగన్ కు అధికారులు వెల్లడించారు.
ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 67 పాజిటివ్ కేసులు నమోదు కాగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1092కి చేరినట్లు చెప్పారు. ఇందులో 524 మంది డిశ్చార్జి కాగా 36 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఈ సమావేశంలో ముఖ్యంగా వలస కూలీలపై ప్రధానంగా చర్చ జరిగింది. వలస కూలీలు, ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన యాత్రికులు, విద్యార్థులు, ఇతర గ్రూపులను సైతం ఏపీలోకి అనుమతిస్తామని మరోమారు స్పష్టం చేశారు. వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకున్న వారిని పరిశీలించి తర్వాత ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడి మిగిలిన వారికి అవకాశం కల్పిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. అలాగే ,కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారమే రాష్ట్రానికి వచ్చేందుకు అనుమతి ఇస్తామని తెలిపారు.
రాష్ట్రానికి వచ్చే వాళ్లు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఆయా రాష్ట్రాల్లో వారు గ్రీన్ జోన్‌లో ఉన్నారా? ఆరెంజ్ జోన్‌లో ఉన్నారా? లేక రెడ్ జోన్‌లో ఉన్నారా? అన్న వివరాలు కూడా సేకరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వీటన్నింటిని నిర్ధారించుకున్న తర్వాతే వలస కూలీలు, చిక్కుకుపోయిన యాత్రికులు, విద్యార్థులకు అనుమతులు మంజూరు చేస్తామని అధికారులు తెలిపారు . అలాగే స్పందన వెబ్ సైట్ ద్వారా మాత్రమే కాకుండా వివిధ మార్గాల ద్వారా విజ్ఞప్తి చేసుకున్న వారు కూడా ఉన్నారని సీఎం జగన్‌కు అధికారులు తెలిపారు. ఇక వ్యక్తిగతంగా వచ్చే వారికి అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు.
ఇక ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చే వారి విషయంలో క్వారంటైన్ విధానం ఎలా ఉండాలన్న దానిపై ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల వారీగా సదుపాయాలు ఉండాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. అలాగే ఇదే సమయంలో ఎంఫాన్ తుపాను ఆంధ్రప్రదేశ్ వైపు వస్తే సన్నద్ధంగా ఉండాలని ఆయన అధికారులను హెచ్చరించారు. తుపాను కదలికలను గమనించాలని, దీనిపై విద్యుత్తు, రెవిన్యూ, పౌరసరఫరాలు, వైద్యశాఖ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తుఫాను వల్ల ఆస్తినష్టం, ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని, చేపల వేట నిషేధ సమయమే అయినా బోట్లలో ఏ ఒక్కరూ సముద్రంలోకి వెళ్లకుండా చూసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.