Begin typing your search above and press return to search.

కొత్త ఆశలు రేకెత్తించిన జగన్... ?

By:  Tupaki Desk   |   19 Dec 2021 12:30 AM GMT
కొత్త ఆశలు రేకెత్తించిన జగన్... ?
X
జగన్ విశాఖ వచ్చారు, మూడు గంటల పాటు బిజీగా గడిపారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు, కొన్నింటికి శంఖుస్థాపన చేశారు. ఈసారి జగన్ విశాఖ టూర్ లో విశేషం ఏంటి అంటే జగన్ మొత్తానికి మొత్తం వైసీపీ నాయకులను ఆప్యాయంగా పలకరించారు. వచ్చిన వారితో మాటా మాంతీ కలిపారు, ఇక జగన్ తో వరసబెట్టి సెల్ఫీలు దిగిపోయి తెగ ఖుషీ అయ్యారు వైసీపీ నేతలు. చాలా కాలానికి మా నాయకుడు విశాఖ వచ్చాడని, పల‌బాగా పలకరించారని కూడా వారు మురిసిపోయారు.

ఇదిలా ఉంటే పదేళ్ళ సుదీర్ఘ నిరీక్షణ తరువాత చట్ట సభలో తొలిసారిగా ఎమ్మెల్సీ అడుగుపెట్టిన విశాఖ సిటీ వైసీపీ ప్రెసిడెంట్వం శీ క్రిష్ణ శ్రీనివాస్ యాదవ్ అయితే ఈసారి సీఎం టూర్ లో స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. జగన్ వంశీ బాగున్నావా అంటూ ఆయన్ని పలకరించడమే కాదు, ఏకంగా కొత్త ఆశలే రేపారు. దాంతో ఇక మా నేత మంత్రి కావడం ఖాయమని వంశీ అనుచరులు తెగ హుషార్ చేస్తున్నారు.

వంశీని గుర్తు పెట్టుకుని మరీ జగన్ దగ్గరకు తీయడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఉత్తరాంధ్రా జిల్లాలలో బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, జగన్ కి నమ్మిన బంటుగా ఉండడంతో వంశీ కి మంత్రి పదవి ఖాయమని అపుడే ఊహాగానాలు మొదలైపోయాయి. విశాఖ సిటీకే చెందిన నేత కావడం వంశీకి మరో ప్లస్ పాయింట్ అంటున్నారు.

ఇప్పటిదాకా మంత్రి పదవిని ఆశిస్తున్న వారు అంతా రూరల్ జిల్లాకు చెందిన వారే కావ‌డంతో సిటీ నుంచి ఏకైక పేరుగా వంశీదే ఉందని అంటున్నారు. నిజానికి జగన్ రాజకీయ సమీకరణలు ఎవరికీ అర్ధం కావు, పైగా ఆయన టార్గెట్ వేరేగా ఉంటుంది. విశాఖ సిటీలో చూసుకుంటే ఈ రోజుకీ టీడీపీకి బలం ఉంది. పైగా యాదవ సామాజిక వర్గం వైసీపీ వైపు వచ్చినా కూడా ఇంకా కీలక నేతలు అటే ఉన్నారు.

దాంతో మంత్రిగా వంశీని చేస్తే బీసీలతో పాటు ఆయన సొంత సామాజికవర్గం కూడా వైసీపీ వైపు టర్న్ అవుతుంది అన్న లెక్కలు కనుక ఉంటే మాత్రం వంశీకి జాక్ పాట్ తగిలినట్లే అంటున్నారు. ఇదిలా ఉండగా జగన్ విశాఖ టూర్ తరువాత ఉత్తరాంధ్రా యాదవ సంఘం నాయకులు చేస్తున్న డిమాండ్ కూడా ఆసక్తి కరంగా ఉంది. వంశీకి మంత్రి పదవి ఇవ్వాలని, ఆ విధంగా తొలిసారిగా ఉత్తరాంధ్రా యాదవులకు మంత్రి వర్గంలో సముచిత స్థానం కల్పించి అమాత్య‌ గౌరవం ఇవ్వాలని కూడా కోరుతున్నారు. మొత్తానికి వంశీ 2027 వరకూ కొనసాగేలా ఎమ్మెల్సీగా హ్యాపీగా పెద్దల సభలో కుదురుకుపోయారు. మంత్రి పదవి కూడా దక్కితే పొలిటికల్ గా ఆయనను మించిన హీరో ఎవరూ ఉండరనే అంటున్నారు.