Begin typing your search above and press return to search.
గరగపర్రు ఎపిసోడ్ లో జగన్ ఏం చేశారు?
By: Tupaki Desk | 1 July 2017 5:44 AM GMTరాజకీయ మైలేజీ వచ్చే అవకాశాన్ని ఏ రాజకీయ నేత వదులుకోడు. అందులోకి ఇప్పుడున్న దూకుడు రాజకీయాల్లో ఏ రోజుకు ఆ రోజు మైలేజీని లెక్కేసుకుంటూ ముందుకెళ్లే రాజకీయ అధినేతలే ఎక్కువ. ఇలాంటప్పుడు దూరదృష్ఠితో రాజకీయాలకు అతీతంగా.. ఆ మాటకు వస్తే రాజకీయాల్ని దరి రాకుండా ఇష్యూ క్లోజ్ చేసే రాజకీయ నేతలు ఉంటారా?
అందునా విపక్షంలో ఉన్న నేత.. తనకు లభించిన అంశాన్ని అసరాగా చేసుకొని.. ఆ ఇష్యూను అంతకంతకూ పెంచుతూ.. తన ఇమేజ్.. మైలేజ్ పెంచుకోవాలనే చూస్తారు. అందుకు తగ్గట్లుగా మరికొంత నిప్పు రాజేయటం కనిపిస్తుంది. కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరించి.. అందరూ బాగుండాలన్న కాన్సెప్ట్ తో ఉన్నతంగా ఆలోచించే వారు చాలా చాలా తక్కువని చెప్పక తప్పదు.
అలాంటి అరుదైన వైఖరిని అనుసరించారు ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కులాల పంచాయితీల్లోకి ఒక కీలక నేత తలదూర్చరు. ఒకవేళ దూర్చినా అది కంగాళీనే అవుతుందే తప్పించి.. అందరి మనసుల్ని దోచుకోవటం ఉండదు. కానీ.. అంతటి క్లిష్టమైన ఫీట్ ను సులువుగా చేసేశారు జగన్. పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రు లో సాంఘిక బహిష్కరణకు గురైన దళితుల్ని పరామర్శించి.. వారిలో మనోస్థైర్యం పెంచిన ఆయన.. అదే సమయంలో మరో వర్గంతోనూ మాట్లాడి సమస్య మూలాల్లోకి వెళ్లి.. సానుకూల దృక్ఫధంతో ఇష్యూను క్లోజ్ చేయటం సరికొత్త రాజకీయ విధానంగా చెప్పక తప్పదు.
ఒక గ్రామంలో శాంతిని నెలకొల్పేందుకు ఒక పార్టీ అధినేత స్వయంగా రంగంలోకి దిగటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో రాజకీయాల్ని పూర్తిగా పక్కన పెట్టేసి.. పార్టీలకు అతీతంగా సమస్య పరిష్కారం మీదనే దృష్టి పెట్టటం ఒక చక్కటి పరిణామంగా చెప్పాలి. నిజానికి ఇలాంటి పనిని అధికారపక్షం కానీ.. కీలక అధికారులు కానీ చేయాలి. అందుకు భిన్నంగా విపక్ష నేత తానే లీడ్ తీసుకొని చేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇంతకూ గరగపర్రులో జగన్ ఏం చేశారన్నది చూస్తే.. గ్రామంలో నెలకొన్ని రెండు వర్గాల మధ్య విభేదాల మీద సమగ్రమైన సమాచారాన్ని తెచ్చుకున్న జగన్.. ఆ గ్రామానికి వెళ్లారు. దళిత వర్గానికి చెందిన వారితో మాట్లాడి సమస్య పరిష్కారం మీద దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా అన్ని కులాల్లో మంచివాళ్లు.. చెడ్డవాళ్లు ఉంటారని.. దుర్మార్గుల్ని పక్కన పెట్టి.. అందరూ కలిసి జీవించాలన్న మాటల్ని అందరూ మెచ్చేలా చెప్పి ఒప్పించారు. అనంతరం దళితేరులను కలిసి వారితోనూ విషయాలు మాట్లాడితే.. ఇద్దరి మధ్యనున్న విభేదాల వివరాల్ని ఓపిగ్గా విన్నారు. ఆపై సమస్య పరిష్కారం మీద నడుం బిగించారు. ఇరు వర్గాల్ని కలిపి గ్రామంలో ఎలాంటి విభేదాలులేవన్న మాటను వారితో చెప్పించి.. వారు ఆనందంతో వీడ్కోలు పలికిన వేళ.. వారి నుంచి సెలవు తీసుకున్న జగన్ గరగపర్రు నుంచి బయటకు వచ్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/