Begin typing your search above and press return to search.
జగన్ తో దాసరి ఏకాంత భేటీ
By: Tupaki Desk | 5 Jan 2016 3:00 PM GMTఆంధ్రప్రదేశ్ రాష్ర్ట రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజకీయాల్లో కీలకంగా ఉన్న నేత, సినిమాల్లో తన సత్తా చాటిన దర్శక-నిర్మాతతో భేటీ అయ్యారు. వీరి భేటీలో సహజంగానే రాజకీయాలు చర్చకురాగా...పూర్తి భరోసా కూడా రావడం ఆసక్తికరం.
వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ - ప్రముఖ దర్శక-నిర్మాత - కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావుతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని దాసరి నివాసానికి స్వయంగా వెళ్లిన జగన్ దర్శకరత్నతో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు వీరి మధ్య సమావేశం జరిగింది. భేటీ అనంతరం దాసరి నారాయణరావు తమది మర్యాదపూర్వక సమావేశమని చెప్తూనే సమావేశ ఆంతర్యాన్ని వివరించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి, తనకు చక్కటి సంబంధాలు ఉన్నాయని అన్నారు. వైఎస్ కుమారుడు అయిన జగన్ ప్రజల సమస్యలపై పోరాటాలు చేస్తున్నారని కితాబిచ్చారు. జగన్ ఇప్పటికే మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడని అతనికి తన దీవెనలు ఎప్పుడు ఉంటాయని తెలిపారు. ఇంకా పెద్ద నాయకుడు కావాలని మనసారా ఆశీర్వదిస్తునట్లు చెప్పారు.
వైఎస్ జగన్ హఠాత్తుగా దాసరితో సమావేశం కావడం వెనుక ఓట్ల లాజిక్కులు ఉన్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. హఠాత్తుగా జగన్ దాసరి నివాసానికి వెళ్లడం ఈ ఎత్తుగడలో భాగమని చెప్తున్నారు.