Begin typing your search above and press return to search.
ఎనీ డౌట్ : అమరావతి... పోలవరం ...అసెంబ్లీ సాక్షిగా....?
By: Tupaki Desk | 21 Sep 2022 3:48 AM GMTఏపీ జనాలకు జీవన్మరణ సమస్యలుగా రెండు గత ఎనిమిదేళ్ళుగా కనిపిస్తున్నాయి. అవి రాజధాని లేని రాష్ట్రం ఒకటైతే రెండు ఏపీకి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్ట్. ఈ రెండు విషయాల్లో వర్షాకాల అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ ఏమి చెప్పారో ఒకసారి చూస్తే అయిదు కోట్ల మందికి వాటి భవిష్యత్తు మీద పూర్తి నిరాశే కలుగుతుంది.
ఎందుకంటే జగన్ ముందు అమరావతి మీదనే చెప్పిన మాటలు తీసుకుంటే లక్షల కోట్లతో ఖర్చు పెట్టే అమరావతిని పూర్తి చేయడం తన వల్లు కాదు అని చేతులెత్తేశారు. అది భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకున్నారు. ప్రభుత్వ ఖజానా వద్ద అంత సొమ్ము లేదని తేల్చేశారు. చంద్రబాబు మాదిరిగా తాను జనాలను మభ్యపెట్టలేనని కూడా చెప్పుకున్నారు. సరే జగన్ చెప్పినవి అన్నీ నిజమే అనుకుంటే ఆయన దీనికి ఆల్టర్నేషన్ గా ఏదో ఒకటి చెప్పాలి కదా.
పోనీ ఆయన భావిస్తున్నట్లుగా మూడు రాజధానుల విషయమైనా ముందుకు తేవాలి కదా. అసలు వర్షాకాల సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు పెడతారని గత రెండు నెలలుగా ఊదరగొట్టి చివరికి ఉసూరుమనిపించారు. అంటే ఆ బిల్లు ప్రవేశపెట్టడం ఇపుడు సాధ్యం కాదని ప్రభుత్వానికి అర్ధమైన తరువాత దాని మీద సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి కోర్టు దిశగా ఈ వ్యవహారాన్ని నడిపారు.
అంటే రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ని కోర్టు స్వీకరించి విచారణ కనుక మొదలెడితే అది పూర్తి కావడానికి ఎంత టైం పడుతుందో ఎవరూ చెప్పలేరు. అంటే మరో పద్దెనిమిది నెలలు మాత్రమే అసెంబ్లీ ఎన్నికలకు వ్యవధి ఉన్న వేళ మూడు రాజధానుల కధ కూడా ఎన్నికలు అయ్యేలోగా తెమలదు అనే అంతా అంటున్నారు. ఆ విధంగా జగన్ ఒకటీ లేదూ మూడూ రాదు అన్నట్లుగా అసెంబ్లీ సాక్షిగా చెప్పేశారు అనే అంటున్నారు.
ఇక పోలవరం సంగతి చూద్దాం. పోలవరం ఏపీకి నిజంగా అద్భుత వరప్రసాదిని. పోలవరం కనుక పూర్తి అయితే ఏపీ సంపన్న రాష్ట్రాల జాబితాలో అతి తొందరలో చేరడం ఖాయం. కానీ పోలవరం కూడా ఎనిమిదేళ్ళుగా అలా పడుతూ లేస్తోంది. విభజన చట్టంలో ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించినా రాష్ట్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవడంతో కేంద్రానికి పట్టనిది అయింది. వారు ఎంత నిధులు ఇస్తే అంతే తీసుకోవాలి. అది కూడా ఎపుడు ఇస్తే అపుడే పుచ్చుకోవాలి.
ఇక పోలవరం ప్రాజెక్టులో గత సర్కార్ తప్పులు చేసింది అదే తమకు ఇపుడు శాపం అయింది అని జగన్ సభ సాక్షిగా చెప్పుకొచ్చారు. ముందు కాఫర్ డ్యాం కట్టకుండా డయా ఫ్రం వాల్ కట్టడం వల్లనే అదిపుడు బీటలు వారిందని, ఆ నష్టం కష్టం ఏకంగా నాలుగు వేల కోట్ల పై దాటి ఉండేలా ఉందని చెప్పారు. ఇపుడు డయా ఫ్రం వాల్ ఏ స్థితిలో ఉందో చూసి దానికి రిపేర్లు చేయాలా తిరిగి నిర్మించాలా అన్నది తేలిస్తే కానీ కధ ముందుకు నడవదని చెప్పేసారు. అంటే ఈ బండ కూడా టీడీపీ మీద వైసీపీ సర్కార్ వేసేసింది.
తాము వచ్చి మూడున్నర ఏళ్ళు అయింది. ఈ దిశగా తాము ఏం చేశామన్నది చెప్పుకున్నారు కానీ పోలవరం తమ హయాంలో పూర్తి చేస్తామని మాత్రం జగన్ సహా మంత్రి అంబటి రాంబాబు చెప్పలేకపోయారు. మరి ఆ విధంగా చూస్తే పోలవరం మీద నీలి నీడలు కమ్ముకున్నట్లు అయింది. అంటే ఏపీకి అత్యంత ప్రతిష్టగా భావించే పోలవరం కానీ రాజధాని వ్యవహారం కానీ తమ చేతుల్లో లేదని చెప్పి వైసీపీ చేతులు ముడిచేసుకున్నది.
మొత్తానికి ఈ స్వల్ప కాలిక సమావేశాలను చూసిన వారికి అర్ధమయ్యేదేంటి అంటే 2024 ఎన్నికల తరువాతనే ఈ రెండింటికీ ఏమైనా ముక్తీ మోక్షం కనిపిస్తుందేమో తప్ప ఇక వైసీపీ ఏలుబడిలో కాదనే తేలిపోతోంది. సో ఇక్కడ సంతోషకరమైన మాట ఏంటి అంటే తమదైన వాదన జగన్ వినిపిస్తూనే అమరావతి పోలవరం కానీ పెద్దగా ఆశలు జనాలకు పెట్టకుండా ముగించేశారు. మరి ఇంతకంటే ప్రభుత్వం నుంచి ఇవ్వగలిగే వివరణ ఏదీ ఉండబోదు. కాబట్టి 2024 ఎన్నికల్లోగా ఏ అధ్బుతాలు జరగవు కాబట్టి జనాలు ఇక ఆశలతో కాలక్షేపం చేయడం మానేసి 2024 తరువాతకే తమ ఆలోచనలను నిలిపి ఉంచడం బెటర్ అనే అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.