Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యేల ప్రొగ్రెస్ రిపోర్టులు రెడీ...జగన్ మార్క్ రోడ్ మ్యాప్ అదే...?
By: Tupaki Desk | 12 Dec 2022 3:30 AM GMTఏపీలో ఎన్నికలకు ఆతృత పడాల్సింది నిజానికి విపక్షాలు కానీ. వైసీపీ అధినేత జగన్ జోరు చూస్తే ఆయనే ముందే తయార్ అంటున్నారు. ఎన్నికలకు రెండేళ్ళ వ్యవధి ఉండగానే జగన్ పార్టీ మీద ఫుల్ ఫోకస్ పెట్టేశారు. తన ఎమ్మెల్యేలను మంత్రులను జనంలోకి పంపించారు. గడప గడప వారిని తొక్కించి జనాభిప్రాయాన్ని గట్టిగానే పట్టుకున్నారు. వివిధ ఏజెన్సీల ద్వారా చేయించిన నివేదికలూ ఎటూ ఉన్నారు. ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్ లో మైక్రో లెవెల్ లో చేయిస్తున్న సర్వేలు కూడా తన దగ్గర ఉంచుకున్న జగన్ మొత్తం 150 మంది ఎమ్మెల్యేల పనితీరు మీద పవర్ ఫుల్ ప్రోగ్రెస్ కార్డ్ ని సిద్ధం చేశారు.
ఇక ఇపుడు దాన్ని పట్టుకుని పార్టీ మీటింగులో ఎవరికి వారికి అప్పగించడమే మిగిలింది అని అంటున్నారు. ఈ మధ్యన జయహో బీసీ సభను నిర్వహించిన జగన్ ఫుల్ జోష్ మీద ఉన్నారు. విపక్షాలు విమర్శలు ఎలా ఉన్నా బీసీ సభ హిట్ అయింది. దంతో ఇదే తీరున మరిన్ని సభలను ఏపీలో అంతటా నిర్వహించడానికి జగన్ చూస్తున్నారు. అదే విధంగా ఎస్సీస్, ఎస్టీస్, మైనారిటీస్ లతో కూడా రాష్ట్ర స్థాయి సభలకు జగన్ ప్లాన్ చేశారని అంటున్నారు. బీసీ ప్రతినిధులతో బూత్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేయాలని చూస్తున్న జగన్ అందులో ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలతో పాటు మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు.
రేపటి ఎన్నికల్లో వారే సారధులుగా మారి జనాలను ఓటేయడానికి తీసుకువస్తారని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఇంకో వైపు చూస్తే ఇప్పటిదాక సంక్షేమం మీదనే ఆధారపడిన జగన్ ఇపుడు అభివృద్ధి కూడా అని ఆలోచిస్తున్నరు. ఇప్పటికే సచివాలయ పరిధిలఒ నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి అక్కడ చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేస్తారని అంటున్నారు. అలాగే ఈ నెల 14న ఏర్పాటు చేయబోయే పార్టీ వర్క్ షాప్ లో ఎమ్మెల్యేల పనితీరు మీద సుదీర్ఘమైన చర్చ ఉంటుంది అని అంటున్నారు.
అందరూ తనకు కావాలి కానీ గెలుపు గుర్రాలకే తాను టికెట్ ఇస్తాను అని జగన్ విడమరచి చెప్పబోతున్నారుట. పార్టీ ఉంటేనే మనం అన్న పాయింట్ వారి మెదడులో ఉంచి ఒక వేళ ఏ కారణం చేత అయినా టికెట్ రాని ఎమ్మెల్యేలకు నచ్చచెబుతారని, వారికి కూడా పార్టీలో ప్రయారిటీ ఇస్తామని, పదవులు ఇస్తామని చెప్పబోతున్నారు అని అంటున్నారు. అలాగే ఇప్పటిదాకా చూస్తే 27 మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది గత వర్క్ షాప్ ద్వారా తెల్సిన సంగతి. అయితే ఈసారి పూర్తి ప్రోగ్రెస్ కార్డులతో జగన్ రెడీ అవుతున్నారు కాబట్టి ఆ సంఖ్య ఇంకా పెరుగుతుందా అన్న చర్చ వస్తోంది.
ఈ వర్క్ షాప్ లో మూడు రాజధానుల గురించి కూడా జగన్ తన మనసులో మాటను ప్రభుత్వ ఆలోచనలను ఎమ్మెల్యేలను చెబుతారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఒక రోడ్ మ్యాప్ ని ఆయన రెడీ చేసి ఉంచారని, దాన్ని వర్క్ షాప్ లో అందరి ముందు పెట్టి ఆ విధంగా అంతా నడచుకోవాలని చెప్పబోతున్నారు అని అంటున్నారు.
మొత్తం మీద చూసుకుంటే జగన్ దూకుడు మీద ఉన్నారు. పార్టీ గెలుపు కోసం ఎలాంటి నిర్ణయానికైనా తాను సిద్ధమని చెబుతున్న జగన్ వర్క్ షాప్ లో ఏ రకమైన ప్రకటనలు చేస్తారో అన్నది చూడాలని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే ప్రోగ్రెస్ కార్డ్ లో ఏముంది అన్నది కూడా ఆసక్తిని పెంచేస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.