Begin typing your search above and press return to search.

చంద్రబాబును నేనెప్పుడూ వ్యక్తిగతంగా తిట్టలేదు

By:  Tupaki Desk   |   7 Jan 2019 1:30 AM GMT
చంద్రబాబును నేనెప్పుడూ వ్యక్తిగతంగా తిట్టలేదు
X
ఏపీలో చంద్రబాబు, జగన్‌ల మధ్య స్పర్థ రాజకీయ వైరం నుంచి వ్యక్తిగతంగా వెళ్తోందని.. ఇద్దరూ పరస్పరం వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారన్న ఆరోపణలపై జగన్ స్పందించారు. చంద్రబాబు తనపై ఎలాంటి విమర్శలు చేస్తున్నారో అందరికీ తెలుసని.. కానీ, తాను మాత్రం ఎన్నడూ చంద్రబాబును వ్యక్తిగతంగా విమర్శించలేదని జగన్ అన్నారు. కావాలంటే మీడియా రికార్డులు చూసుకోవచ్చన్నారు. రాష్ట్రానికి ఆయన అన్యాయం చేసిన ప్రతిసారీ... దాన్ని నిలదీశానని.. ఇలా ప్రజలకు అన్యాయం చేయడానికి సిగ్గులేదా అని ప్రశ్నించానని.. అంతేకానీ, ఆయన వ్యక్తిగత అంశాల జోలికి పోలేదని చెప్పారు.

‘చంద్రబాబునాయుడి గురించి వ్యక్తిగతంగా నేనైతే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చంద్రబాబునాయుడి గురించి వ్యక్తిగతంగా నేను మాట్లాడి ఉంటే నాకు చెప్పండి. నేను మాట్లాడిన ప్రతిమాటా ఆయన చేసిన తప్పును ఎత్తి చూపించడమే. ‘అయ్యా, చంద్రబాబు గారు..మీరు ఈ మాట అన్నారు. ఇది చేశారు. ఇది అన్యాయం కాదా? ఇది చెయ్యడానికి మీకు సిగ్గులేదా?..ఏదైనా కూడా వ్యక్తిగతంగా నేను మాట్లాడలేదు అన్నారు.

అయితే.. చంద్రబాబు మాత్రం ఒక్కోసారి బీపీ వచ్చి తన విషయంలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని అన్నారు. ఆయనొక్కరే కాదని.. ఆయన వద్ద మంత్రులుగా పనిచేసిన వారు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు. వాళ్లు తిడుతున్నా కూడా ఈయన ఖండించకపోగా వికటానందం పొందుతూ ఉంటారన్నారు.