Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ కేబినెట్ ఫార్ములా ఇదేన‌ట‌!

By:  Tupaki Desk   |   1 Jun 2019 12:34 PM GMT
జ‌గ‌న్ కేబినెట్ ఫార్ములా ఇదేన‌ట‌!
X
ఏపీకి ముఖ్య‌మంత్రి అయ్యారు జ‌గ‌న్‌. ఇప్పుడు ఆయ‌న మంత్రివ‌ర్గం ఎలా ఉంటుంద‌న్న‌ది అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంది. ఎవ‌రిని ఎంపిక చేస్తారు? ఎవ‌రికి ఎలాంటి శాఖ‌లు కేటాయిస్తార‌న్న ఉత్కంట వ్య‌క్త‌మవుతోంది. 151 సీట్ల భారీ మెజార్టీతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన నేప‌థ్యంలో మంత్రిప‌ద‌వుల కోసం పోటీ ఎక్కువ‌గా ఉంది.

అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్ ఎవ‌రిని ఎంపిక చేసుకోవాల‌న్న విష‌యంపై ఆయ‌న‌కు స్ప‌ష్ట‌మైన అవగాహ‌న ఉన్న‌ట్లుగా చెప్పాలి. ఇప్ప‌టికే మంత్రివ‌ర్గ ఎంపిక మీద జ‌గ‌న్ క‌స‌ర‌త్తు పూర్తి చేసిన‌ట్లుగా చెబుతారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. జ‌గ‌న్ మంత్రివ‌ర్గ ఫార్ములాకు సంబంధించిన కొన్ని విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఏపీలో ఉన్న 13 జిల్లాల‌ను రానున్న రోజుల్లో పాతిక జిల్లాలుగా చేయ‌నున్న‌ట్లు చెబుతున్నారు. ఒక‌వేళ మ‌రో జిల్లా పెరిగినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు.

ఈ నేప‌థ్యంలో కొత్త జిల్లా కాంబినేష‌న్ ను దృష్టిలో పెట్టుకొనే మంత్రుల ఎంపిక ఉండే అవ‌కాశం ఉందంటున్నారు. ప్ర‌తి జిల్లాకు త‌ప్ప‌నిస‌రిగా ఒక‌రు చొప్పున ఎంపిక చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. అదే స‌మ‌యంలో పెద్ద వ‌య‌స్కుల‌తో పాటు.. మ‌ధ్య వ‌య‌స్కుల వారికి స‌మ ప్రాధాన్య‌త ఇచ్చే వీలున్న‌ట్లుగా చెబుతున్నారు. అనుభ‌వానికి.. యువ‌త‌రానికి స‌మ ప్రాధాన్య‌త ఇవ్వ‌టంతోపాటు.. మ‌హిళ‌ల‌కు కూడా చోటుక‌ల్పించేలా కూర్పు ఉంటుంద‌ని చెబుతున్నారు.

అదే స‌మ‌యంలో కుల‌.. మ‌తం.. ప్రాంతాల విష‌యంలోనూ స‌మ‌తుల్య‌త మిస్ కాన‌ట్లుగా జ‌గ‌న్ ప‌క్కా కాంబినేష‌న్ తో లిస్ట్ త‌యారు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. జ‌గ‌న్ స‌న్నిహిత వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. మంత్రివ‌ర్గ కూర్పు బాగుంద‌న్న ప్ర‌శంస రావ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ అంచ‌నాలు మాత్ర‌మే ఉన్న మంత్రివ‌ర్గం.. రియాలిటీలో ఎలా ఉంటుందో చూడాలి.