Begin typing your search above and press return to search.
జగన్ సెటైర్!... బాబుది 420 దీక్షేనట!
By: Tupaki Desk | 14 April 2018 2:13 PMఏపీకి ప్రత్యేక హోదా పేరిట ఇప్పుడు టీడీపీ చేపట్టిన కొత్త ఉద్యమం జనానికి అంతగా ఎక్కలేదనే చెప్పాలి. ఎందుకంటే... అధికారం చేపట్టిన తర్వాత నాలుగేళ్ల దాకా ఏపీకి ప్రత్యేక హోదా పట్టనట్టే వ్యవహరించిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం తాము చేస్తున్న పోరాటంతో కేంద్రం దిగిరాక తప్పదని చెబుతున్న వైనం జనానికి కామెడీగానే పరిణమిస్తోందని చెప్పక తప్పదు. అంతేకాకుండా ఏపీకి ప్రత్యేక హోదా పేరెత్తితే జైల్లో పెట్టేస్తానని, ప్రత్యేక ప్యాకేజీకి తాను ఒప్పుకున్నానని, దీంతో హోదా ముగిసిన అద్యాయమేనని బాబే స్వయంగా చెప్పిన వైనం కూడా ఇప్పటి టీడీపీ పోరు జనానికి గుర్తు చేస్తోందనే చెప్పాలి. మొత్తంగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం టీడీపీ చేస్తున్న నిరసనలన్నీ కామెడీగానే తలపిస్తున్నాయన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
ఇలాంటి కీలక తరుణంలో చంద్రబాబు నోట నుంచి వెలువడిన నిరాహార దీక్ష ప్రకటనను బేస్ చేసుకుని ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన శైలిలో సెటైర్లు సంధించారు. గతంలో పేలినట్లుగానే ఇప్పుడు కూడా బాబుపై జగన్ సెటైర్ బాగానే పేలిందన్న వాదన వినిపిస్తోంది. అయినా ఈ దఫా జగన్ ఏ తరహా సెటైర్ వేశారన్న విషయానికి వస్తే... ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షకు దిగుతానని చెప్పిన చంద్రబాబును జగన్ ఏకంగా 420గా అభివర్ణించేశారు. కేలండర్ ఇయర్ లో నాలుగో నెల అయిన ఏప్రిల్ మాసంలో 20వ తేదీన జన్మించిన చంద్రబాబును ఇప్పటికే జగన్ 420గా అభివర్ణిస్తున్న విషయం తెలిసిందే. సందర్భం వచ్చిన ప్రతి సారీ ఈ సెటైర్ ను బాగానే పేల్చేస్తున్న జగన్... ఈ దఫా కూడా దానిని తనదైన శైలిలో బాంబులా పేల్చారు.
బాబు నిర్వహించతలపెట్టిన దీక్షపై జగన్ ఏమన్నారన్న విషయానికి వస్తే... *చంద్రబాబు తన పుట్టిన రోజున దీక్ష చేస్తారట. ఆయన పుట్టినరోజు ఎప్పుడో తెలుసా? ఏప్రిల్ 20 అట. ఏప్రిల్ అంటే 4.. 20వ రోజున చేస్తారట.. అంటే 420.. ఆ ఏప్రిల్ 20న ఆయన కొంగ జపం చేస్తారట. ఆయన నిరాహార దీక్ష చేస్తారట. ఎంపీలతో రాజీనామా చేయించకపోగా ఇటువంటి పనులు చేస్తున్నారు. టీడీపీ ఎంపీలతో చంద్రబాబు రాజీనామాలు చేయించి, ఆమరణ దీక్షకు దిగి ఉంటే ప్రత్యేక హోదా వచ్చేది. అవి చేయకుండా ఏప్రిల్ 20న, ఈ 420 మనిషి దీక్ష చేస్తారట" అని జగన్ తనదైన శైలిలో సెటైర్‌ను పండించేశారన్న వాదన వినిపిస్తోంది. అంటే రాష్ట్రం కోసం దీక్ష చేస్తున్న సందర్భంగానూ చంద్రబాబు... జగన్‌కు అడ్డంగా బుక్కయ్యారన్న మాట.