Begin typing your search above and press return to search.

బాబు తీరును ఎండగట్టిన జగన్ ట్వీట్

By:  Tupaki Desk   |   7 Aug 2018 8:03 AM GMT
బాబు తీరును ఎండగట్టిన జగన్ ట్వీట్
X
చంద్రబాబు మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరును వైఎస్ జగన్ తీవ్రంగా తప్పుపట్టారు. ఆడపడుచులపై అమానుషంగా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా ట్విట్టర్ ద్వారా సంధించిన ప్రశ్నలు చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. మంగళవారం జగన్ చేసిన ట్వీట్ లో మధ్యాహ్న భోజన కార్మికుల బాధను కళ్లకు కట్టారు..

మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చలో విజయవాడ నిరసన కార్యక్రమం చేపడితే మహిళలపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారని.. టీడీపీ ప్రభుత్వం అక్రమ అరెస్ట్ చేయించిందని జగన్ దుయ్యబట్టారు. మహిళా పార్లమెంటును విజయవాడలో నిర్వహించామని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు.. అదే విజయవాడలో మహిళల పట్ల వ్యవహరించిన తీరు సిగ్గుచేటు కాదా అని నిలదీశారు. వారి పట్ల దురుసగా ప్రవర్తించిన తీరు అత్యంత హేయం, దారుణం అని మండిపడ్డారు. చంద్రబాబు మధ్యాహ్న భోజన వ్యవస్థను తీసేయాలని 6 నెలలుగా బిల్లులు చెల్లించడం లేదని.. ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలనే ఈ కుట్ర చేస్తున్నాడని మండిపడ్డారు. సరిగ్గా వేతనాలు ఇవ్వకున్నా 85వేల మంది మహిళలు అప్పులు చేసి పిల్లలకు వండిపెడుతున్నారని.. వీరినే తొలగించాలని బాబు కుట్ర చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు.

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మధ్యాహ్న భోజన పనిని రాష్ట్రంలోని అక్కాచెల్లెల్లకు అప్పగించి వారికి గౌరవవేతనం పెంచుతామని వైఎస్ జగన్ ఈ సందర్భంగా ప్రకటించారు. మధ్యాహ్న భోజన మహిళలకు అండగా ఉంటూ పిల్లలకు పౌష్టికాహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. భోజన ధరలు కూడా పెంచి బిల్లులను సకాలంలో చెల్లిస్తామని జగన్ ట్విట్టర్ లో తెలిపారు.