Begin typing your search above and press return to search.
'వెలుగులు’ పంచేందుకు జగన్ రెడీ
By: Tupaki Desk | 10 Oct 2019 6:33 AM GMTసీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఎన్నో అద్భుతమైన పథకాలు అమలు చేసి ప్రజలకు చేరువయ్యారు. తాజాగా మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఏపీలో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చే ఈ పథకాన్ని నేడు రాయలసీమలో ప్రారంభించబోతున్నారు.
తెలంగాణలో హిట్ అయిన ‘కంటివెలుగు’ పథకం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రారంభం కాబోతోంది. ప్రజల అంధత్వ నివారణ ఉద్దేశించిన ‘వైఎస్ఆర్ కంటివెలుగు’ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ గురువారం అనంతపురం జిల్లా ప్రారంభించనున్నారు. రెండు దశల్లో జరుగునున్న ఈ కార్యక్రమంలో దాదాపు 70 లక్షల మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈ పథకంలో కంటి సమస్యలు ఉన్న ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితం కళ్లద్దాల పంపిణీ, శస్త్రచికిత్సలు, ఇతర వైద్య సేవలను ఉచితంగా అందిస్తారు.
రాష్ట్రంలోని 5.40 కోట్ల మంది ప్రజలకు సమగ్ర కంటి పరీక్షలు నిర్వహిస్తారు. శుక్లాలతో బాధపడే వారికి శస్త్రచికిత్సలు చేయిస్తారు. మెల్ల - డయాబెటిస్ రెటినోపతి - గ్లకోమా సమస్యలను గుర్తించి చికిత్సలు అందిస్తారు. పిల్లల్లో పోషకాహార లోపాన్ని గుర్తించి వారికి అవసరమైన విటమిన్ ఏ అందిస్తారు.