Begin typing your search above and press return to search.
బాబు-రాధాకృష్ణలను కలిపి తిట్టిన జగన్
By: Tupaki Desk | 3 April 2019 8:47 AM GMTజగన్ సాధారణంగా ఎల్లో మీడియాను విమర్శిస్తుంటారు. అది అరుదేం కాదు. కానీ ఈరోజు ఎపుడూ లేనంత తీవ్రంగా పేర్లు పెట్టి మరీ తిట్టాడు. సత్తెనపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆంధ్రజ్యోతి పత్రికను, రాధాకృష్ణను, చంద్రబాబును కలిపి తిట్టారు. చంద్రబాబు కోసమే ఎల్లో మీడియా పనిచేస్తుందని, ప్రజల కోసం పనిచేయడం ఏనాడో మానేసిందని అన్నారు.
జగన్ మాటల్లో చెప్పాలంటే.. **జగన్‌పై ఎంత దుష్ప్రచారం చేసినా జనం నమ్మడం లేదనే భయం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, చంద్రబాబు ముఖాల్లో కనిపిస్తోంది. టీడీపీ అధికారంలోకి వస్తుందని లోక్ నీతి సర్వే చెప్పినట్లు రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిలో బ్యానర్ స్టోరీ వేశాడు. ఈ సర్వే తాము చేయలేదని ఛీ కొట్టి రాధాకృష్ణ ముఖంపై సదరు సంస్థ ఉమ్మేసింది. అయినా సిగ్గు లేకుండా తుడుచుకొని మళ్లీ అటువంటి కథనాలే రాస్తున్నారు. రోజూ ఇలాంటి అబద్ధాలే ప్రచారం చేస్తున్నారు. బంగారం కంటే బొగ్గే అందంగా ఉంటుందని, నెమలి కంటే కాకి అందంగా ఉంటుందని చెప్పగలిగిన దిగజారుడు లక్షణాలు ఎల్లో మీడియాకు ఉన్నాయి.** అని జగన్ విమర్శించారు.
మీరు గమనించారో లేదో చంద్రబాబు అక్రమాలపై ఒక్క కథనం కూడా ఎల్లో మీడియాలో రాలేదు. తెలుగుదేశంలో ఎన్ని అక్రమాలు జరిగిందీ ప్రజలకు తెలియదా? సరే తప్పులు చేసి దాక్కుంటే దాక్కున్నారు. పైగా వీళ్లు నీతి, నిజాయితీ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. జర్నలిజం అంటే చంద్రబాబు ప్రయోజనాల పరిరక్షణా? లేక చంద్రబాబు ద్వారా యెల్లో మీడియాకు కలిగే ప్రయోజనమా అని జగన్ ప్రశ్నించారు.
యెల్లో మీడియా ఉద్దేశం ఒకటే... చంద్రబాబు పాలనపై చర్చ జరగకూడదు. జరిగితే టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కవు అని వారికి భయం. తెలుగుదేశం చేసిన తప్పులే ఇపుడు చంద్రబాబును ఓడించబోతున్నాయని జగన్ చెప్పారు.