Begin typing your search above and press return to search.

మోడీతో జ‌గ‌న్ ఏం మాట్లాడారంటే?

By:  Tupaki Desk   |   10 May 2017 10:22 AM GMT
మోడీతో జ‌గ‌న్ ఏం మాట్లాడారంటే?
X
ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీతో ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భేటీ అయ్యారు. వాస్త‌వానికి మోడీతో గ‌తంలోనే క‌ల‌వాల్సి ఉంది. అయితే.. అప్ప‌ట్లో క‌లిసేందుకు కుద‌ర‌ని నేప‌థ్యంలో.. తాజాగా మోడీ అపాయింట్ మెంట్ ల‌భించ‌టంతో జ‌గ‌న్ ఢిల్లీకి వెళ్లారు. పార్టీ నేత‌ల‌తో క‌లిసి మోడీని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఏపీలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల్ని ఆయ‌న దృష్టిని తీసుకెళ్లారు.

పార్టీ ఫిరాయింపులు.. అన‌ర్హ‌త అంశాల్ని మోడీ దృష్టికి తీసుకెళ్లిన జ‌గ‌న్‌.. ఫిరాయింపుదారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. పార్టీ ఫిరాయింపులే రాజ్యాంగ విరుద్ధ‌మైతే.. అలా ఫిరాయించిన వారిలో న‌లుగురికి మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌టం మ‌రింత దారుణ‌మ‌ని.. ఈ విష‌యాన్ని ప్ర‌ధాని దృష్టికి తీసుకెళ్లిన‌ట్లుగా చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితుల‌కు న్యాయం జ‌రిగేలా చూడాల‌ని..ఈ అంశంలో ఏపీ మంత్రులు.. టీడీపీ నేత‌లకు సంబంధాలు ఉన్నాయ‌ని.. ఈ ఉదంతంలో మంత్రి నారా లోకేశ్‌పై కూడా ఆరోప‌ణ‌లు ఉన్న‌ట్లు ప్ర‌ధాని దృష్టికి తాను తీసుకెళ్లిన‌ట్లుగా చెప్పారు.
గ‌తంలోనే ప్ర‌ధాని మోడీ అపాయింట్ మెంట్ అడిగామ‌ని.. తాజాగా ల‌భించ‌టంతో మోడీని క‌లిసిన‌ట్లుగా చెప్పారు. మిర్చి రైతుల‌కు కేంద్రం క్వింటాలుకు రూ.5వేల మ‌ద్ద‌తు ధ‌ర ప్ర‌క‌టించింద‌ని.. రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా రూ.3వేలు జ‌త చేసి మొత్తం రూ.8వేల చెల్లించి రైతుల్ని ఆదుకోవాల‌న్నారు. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఏపీకి హోదా ఇవ్వాల‌ని కోరామ‌ని.. గ‌తంలో ఈ విష‌యంపై ప్ర‌ధాని మోడీ హామీ ఇచ్చార‌ని..ఈ సారి కూడా ఆయ‌న దృష్టికి హోదా అంశాన్ని తీసుకెళ్లామ‌న్నారు. హోదాను సాధించే వ‌ర‌కూ త‌న పోరాటం సాగుతుంద‌న్న జ‌గ‌న్‌.. హోదాపై మ‌రోమారు ఆలోచించాల‌ని కోరిన‌ట్లుగా చెప్పారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఎన్డీయేకే త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని చెప్పిన ఆయ‌న‌.. ఎటూ గెలిచేది ఏన్డీయే కాబ‌ట్టి.. రాష్ట్రప‌తి లాంటి ప‌ద‌వికి పోటీ పెట్ట‌క‌పోవ‌ట‌మే శ్రేయ‌స్క‌రంగా చెప్పారు. రాష్ట్రప‌తిని ఏక‌గ్రీవంగా ఎన్నుకోవ‌టం మంచిద‌న్న అభిప్రాయాన్ని జ‌గ‌న్ వ్య‌క్తం చేశారు. బీజేపీకి త‌మ పార్టీకి మ‌ధ్య రెండు అంశాల్లోనే అభిప్రాయ భేదాలుఉన్న‌ట్లుగా చెప్పిన జ‌గ‌న్‌.. అందులో ఒక‌టి ప్ర‌త్యేక హోదా అయితే.. రెండోది భూసేక‌ర‌ణ అంశంగా చెప్పారు.