Begin typing your search above and press return to search.

కరోనాపై సమీక్ష.. సీఎం జగన్ కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   21 Aug 2020 4:14 PM GMT
కరోనాపై సమీక్ష.. సీఎం జగన్ కీలక నిర్ణయం
X
రోజురోజుకు విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టడంపై సీఎం జగన్ తాజాగా అమరావతిలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో 138 ఉన్న కోవిడ్-19 ఆస్పత్రులను ఏకంగా 287కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వీటిల్లో డాక్టర్లు, సిబ్బందిని వీలైనంత త్వరగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఇక కరోనా పోరులో కష్టపడుతున్న పారిశుధ్య సిబ్బందికి జగన్ వరం ఇచ్చారు. వారి జీతాలు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు.

కోవిడ్ సెంటర్లలో మౌళిక వసతులతోపాటు మంచి భోజనం రోగులకు అందించాలని.. హోం క్వారంటైన్ లో ఉన్న వారికి సేవలు, మందులు, చికిత్సలు సక్రమంగా అందించాలని జగన్ అధికారులను ఆదేశించారు.

ఆరోగ్య శ్రీ సేవలను కరోనాకు వర్తింపచేసి అత్యుత్తమ సేవలు అందించాలని జగన్ అధికారులను కోరారు. కరోనా లేకున్నా ఆస్పత్రులు చికిత్సలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇక గర్భిణులకు డెలివరీ అయ్యాక డిశ్చార్జి సమయంలోనే వారి అకౌంట్లో డబ్బులు పడేలా చూడాలని.. పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.