Begin typing your search above and press return to search.
మాట విననోళ్ల ప్రాణాలు తోడేసే రాక్షస పాలన
By: Tupaki Desk | 22 May 2017 7:58 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ హత్యలను ప్రోత్సహిస్తున్నాడని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు ఈ మేరకు ప్రత్యేక నివేదిక ఇచ్చారు. పత్తికొండ వైఎస్సార్ కాంగ్రెస్ నేత చెరుకులపాడు నారాయణరెడ్డిని దారుణంగా హతమార్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పాల్పడుతున్న హత్యా రాజకీయాలపై గవర్నర్‌కు వైఎస్ జగన్ ఫిర్యాదు చేశారు. పలువురు పార్టీ సీనియర్ నేతలతో గవర్నర్‌ను కలిసిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ గవర్నరును కలిసి పరిస్థితులను వివరించాం, రాజకీయ హత్యల వివరాలు అందించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎంతటి దారుణంగా రాజకీయ హత్యలు జరుగుతన్నదీ వివరించామని జగన్ వెల్లడించారు.
అప్రజాస్వామికంగా ఖూనీలు చేస్తూ టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ``టీడీపీ నేతల కొనుగోలుకు లొంగకపోతే... ప్రలోభాలకు లొంగకపోతే ప్రత్యర్థులను మట్టుపెడుతున్నారు. హత్యలకు పాల్పడుతున్నారు. వ్యతిరేకించే వారిని చంపుతున్నారు. ప్రభుత్వ తీరును, చంద్రబాబు వైఖరిని..గవర్నరుకు వివరించాం. పత్తికొండ వైఎస్సార్‌సీపీ నేత నారాయణరెడ్డిని అతి కిరాతకంగా చంపేసిన ఉదంతాన్ని వివరించాం. రాబోయే ఎన్నికలలో గెలుస్తాడని, తమ మనుగడకు ముప్పు ఉందని ప్రత్యర్థిని లేకుండా చేశారు. తుపాకీ లైసెన్స్ రెన్యువల్ అడిగితే కూడా చేయలేదు. వెపన్‌ను సరెండర్ చేస్తే తిరిగి ఇవ్వలేదు. ఇసుక మాఫియాను నారాయణరెడ్డి అడ్డుకున్నందుకే ఇదంతా. హైకోర్టు కూడా కేఈ కుమారుడిపై విచారణకు ఆదేశించింది. ఇసుక మాఫియాపై నారాయణరెడ్డి పోరాటం చేశాడు. తనకు భద్రత కల్పించాలని నారాయణరెడ్డి కోరాడు. ప్రభుత్వం పట్టించుకోలేదు. మండల స్థాయి టీడీపీ నేతలకు గన్‌మెన్లు ఇస్తున్నారు కానీ తమ వారికి ఇవ్వడం లేదు. నారాయణరెడ్డి హత్యలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల ప్రమేయం ఉంది`` అని జగన్ మండిపడ్డారు.
తమ పార్టీకి చెందిన నారాయణరెడ్డికి భద్రత కల్పించలేదని, దీంతో పథకం ప్రకారం చంపేశారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ``ఉదయం 9.30 గంటలకు ఘటన జరిగితే ... మధ్యాహ్నం రెండున్నర దాకా పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లలేదు. కేసులో సాక్ష్యాధారాలు లేకుండా చేశారు. మరో వైపు టీడీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోంది. వారు డిస్‌క్వాలిఫై కాకుండా చూస్తోంది. చంద్రబాబు దిగజారుడు తనం అంతా ఇంతా కాదు. చంద్రబాబు కుట్రదారుడు ఇలా అయితే ప్రజాస్వామ్యం బతకదు. మూడేళ్లలో పలు రాజకీయ హత్యలు జరిగాయి. చంద్రబాబు మూలంగా రాజమండ్రిలో 29 మంది చనిపోయారు. స్మగ్లర్లని మరో 29 మందిని చంపేశారు. దీనికి బాధ్యుడైన చంద్రబాబుపై కేసులు పెట్టాలి... జైలుకు పంపాలి, కానీ అలా జరడగం లేదు. అందుకే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని గవర్నరును కోరాం. చంద్రబాబును ముందు జైలుకు పంపాలి అని విజ్ఞప్తి చేశాం`` అని జగన్ తెలిపారు.
చంద్రబాబు ను విమర్శిస్తే కేసులు పెడుతున్నారని జగన్ ఆక్షేపించారు. ``సోషల్ మీడియాను కూడా వదలడం లేదు. సోషల్ యాక్టివిస్టులపై కేసులు పెడుతున్నారు. చంద్రబాబు వైఖరి న్యాయంగా ఉందా? ఏపీలో టీడీపీ నేతలపైన ఉన్న కేసులను సర్కారు ఉపసంహరించుకుంది. 132 జీవోలు విడుదల చేసి టీడీపీ నేతలు ఇది వరకు చేసిన నేరాలను ఉపసంహరించారు.ఇలాంటి విషయాలు కూడా ఆలోచించండి అని గవర్నర్‌ను కోరాం.