Begin typing your search above and press return to search.
జగన్ క్విక్ రియాక్షన్!..బాబుకు భారీ డ్యామేజే!
By: Tupaki Desk | 15 Dec 2017 10:03 AM GMTవైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పీడు అమాంతంగా పెరిగిపోయింది. ఇప్పటిదాకా ఏ అంశంపై అయినా వేగంగానే స్పందిస్తూ వస్తున్న జగన్... నెల క్రితం మొదలెట్టిన ప్రజా సంకల్ప యాత్రతో ఆ వేగాన్ని డబుల్ - త్రిబుల్ చేశారన్న వాదన వినిపిస్తోంది. తన సొంత జిల్లా కడపలో మొదలైన జగన్ పాదయాత్ర కర్నూలు జిల్లాను చుట్టేసి ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. ఈ యాత్ర ఏ జిల్లాలో కొనసాగుతోందన్న విషయంతో సంబంధం లేకుండా రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా కూడా జగన్ చాలా వేగంగా స్పందిస్తున్నారు. ఆ స్పందనతో టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు నిజంగానే హైబీపీ పెరిగిపోతోందన్న వాదన కూడా లేకపోలేదు. జగన్ యాత్ర కొనసాగుతున్న కొద్దీ కూడా బాబులో బీపీ పెరిగిపోతున్న వైనాన్ని టీడీపీ నేతల వ్యాఖ్యలే రుజువు చేస్తున్నాయి.
ఇక తాజా విషయానికి వస్తే... టీడీపీకి కంచుకోటగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో కాసేపటి క్రితం ఓ విషాధం చోటుచేసుకుంది. మొన్నటి ఎన్నికల్లో మొత్తం అసెంబ్లీ సీట్లన్నీ టీడీపీ ఖాతాలో పడిపోయిన ఆ జిల్లాలోని నిడమర్రు మండలం ఫత్తేపురం గ్రామంలో మద్యం వద్దంటూ గడచిన కొన్ని రోజులుగా ఉద్యమం సాగుతోంది. మద్యం షాపులు తమకు అవసరం లేదని ఆ గ్రామానికి చెందిన మహిళలంతా ఉద్యమిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న మద్యం డిపోల సంఖ్యను తగ్గించాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా మరిన్ని మద్యం డిపోలను పెంచుతున్నట్లుగా ప్రకటన చేసింది. ఈ విషయం తెలిసిన గ్రామానికి చెందిన వృద్ధ మహిళ సుబ్బమ్మ గుండెపోటుకు గురై చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే జగన్ చాలా వేగంగా స్పందించారు. నేరుగా సీఎం చంద్రబాబుకు ఓ బహిరంగ లేఖను సంధించారు.
సుబ్బమ్మ మృతికి ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరే కారణమంటూ జగన్ ఆ లేఖలో ఆరోపించారు. మద్యం షాపులే వద్దంటూ ఉద్యమం చేస్తుంటే... మద్యం డిపోల సంఖ్యను పెంచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా సుబ్బమ్మ గుండెపోటుకు గురయ్యారని జగన్ ఆరోపించారు. మొత్తంగా సుబ్బమ్మ మృతికి చంద్రబాబు సర్కారు మద్యం పాలసీనే కారణమని జగన్ తేల్చి చెప్పారు. ఇదేదో చిన్న విషయమేనని అధికార పార్టీ నేతలు, ఇతరులు కొట్టిపారేసినా... గతంతో మద్య నిషేధానికి కారణం ఓ మహిళ చేపట్టిన ఉద్యమమే కారణమన్న విషయం గుర్తు చేసుకుంటే ఇప్పుడు సుబ్బమ్మ మరణం చంద్రబాబు సర్కారుకు పెద్ద దెబ్బేనని చెప్పాలి. అంతేకాకుండా విపక్ష నేత హోదాలో ఉన్న జగన్... ఈ విషయంపై చాలా వేగంగా స్పందించడంతో పాటుగా చంద్రబాబు సర్కారు అవలంబిస్తున్న విధానాన్ని చాలా సూటిగా ప్రస్తావిస్తూ సుబ్బమ్మ మృతికి ప్రభుత్వమే కారణమంటూ ఆరోపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో మెగా ఆక్వా ఫుడ్ పార్క్ విషయంపై ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ విషయంలో తన తప్పును కప్పిపుచ్చుకునే క్రమంలో నడిపించిన వ్యవహారాన్ని జగన్ బాగానే ఎలివేట్ చేయగలిగారు. ఇప్పుడు సుబ్బాయమ్మ మృతిపై కూడా చాలా వేగంగా స్పందించిన జగన్... చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తున్న విధానాల వల్ల జనానికి ఏ తరహాలో గుండెపోటులు వస్తున్నాయన్న విషయాన్ని కూడా జనానికి వివరించడంలో సఫలీకృతులయ్యారనే చెప్పాలి. మొత్తంగా టీడీపీకి కంచుకోటగా ఉన్న జిల్లాలో చోటుచేసుకున్న ఘటనను ఆధారం చేసుకుని జగన్ వ్యవహరించిన తీరు కారణంగా వచ్చే ఎన్నికల్లో ఆ జిల్లాలో టీడీపీకి గట్టి దెబ్బే తప్పదన్న వాదన వినిపిస్తోంది.