Begin typing your search above and press return to search.
ఎవరీ నాగేశ్వరరెడ్డి.. సీఎం జగన్ పీఏ ఎందుకయ్యాడు!
By: Tupaki Desk | 1 Jun 2019 12:30 PM GMTఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పీఏ ఎవరు? సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉంటూ.. ఆయన చెప్పే పనుల్ని ఇట్టే చేసి పెట్టే చాకులాంటి పీఏగా ఆయన ఎవర్ని ఎంపిక చేసుకున్నారన్న దానిపై సస్పెన్స్ వీడిపోయింది. ఆయనకు అత్యంత సన్నిహితుడు.. తన వెంటే ఉండే వ్యక్తినే జగన్ పీఏగా ఎంపిక చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
దాదాపు పదకొండేళ్లుగా జగన్ వెంటే ఉంటున్న కె. నాగేశ్వరరెడ్డిని జగన్ తన పీఏగా ఎంపిక చేసుకున్నారు. అతగాడి సొంతూరు కడప. వివిధ మీడియా సంస్థల్లో పని చేసిన అనుభవం ఉన్న అతగాడు.. కొన్నేళ్లుగా జగన్ వెంటే ఉంటున్నారు. అంతేకాదు.. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో కీలకంగా వ్యవహరించిన నాగేశ్వరరెడ్డి.. జగన్ మనసెరిగి పని చేస్తారని చెబుతారు.
విశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్ మీద దాడి జరిగిన సమయంలోనూ యువనేత పక్కనే నాగేశ్వరరెడ్డి ఉన్నారు. వివిధ వర్గాలకు చెందిన వారితో సమావేశాల్ని ఏర్పాటు చేయించటంలో నాగేశ్వరెడ్డికి మంచి పట్టు ఉందని చెబుతారు. జగన్ మూడ్స్ కు తగ్గట్లు రియాక్ట్ అవుతుంటారని చెబుతారు.
ఆయన ఎప్పుడేం కోరుకుంటారో నాగేశ్వరరెడ్డి ఇట్టే పట్టేస్తారన్న పేరుంది. జగన్ కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న నాగేశ్వరరెడ్డికి జగన్ అవకాశం ఇచ్చారని చెప్పాలి. ఇదిలాఉంటే.. పులివెందులలోని సీఎం క్యాంపు కార్యాలయం పీఏగా డి. రవిశేఖర్ ను ఎంపిక చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. విధేయత..తనతో ఎప్పటినుంచో జర్నీ చేస్తున్న వారికే జగన్ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా చెప్పాలి.