Begin typing your search above and press return to search.

జ‌లుబు.. ద‌గ్గుతో ఇబ్బంది ప‌డుతూనే పాద‌యాత్ర‌

By:  Tupaki Desk   |   15 Jan 2018 6:01 AM GMT
జ‌లుబు.. ద‌గ్గుతో ఇబ్బంది ప‌డుతూనే పాద‌యాత్ర‌
X
ఇచ్చిన మాట కోసం ఎంత క‌ష్టానికైనా వెనుకాడ‌ని త‌త్త్వం ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిలో క‌నిపిస్తుంది. ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకునేందుకు ఆయ‌న స్టార్ట్ చేసిన పాద‌యాత్ర 62 రోజులు పూర్తయ్యాయి. ప్ర‌స్తుతం చిత్తూరు జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్‌కు ఆరోగ్యం ఏ మాత్రం బాగోవ‌టం లేదు. విప‌రీత‌మైన జ‌లుబు.. ద‌గ్గుతో ఇబ్బంది ప‌డుతున్నారు.

జ‌లుబు.. ద‌గ్గు పెద్ద జ‌బ్బులేం కాన‌ప్ప‌టికీ.. ఎంత‌లా చికాకు పెడ‌తాయో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అయిన‌ప్ప‌టికి పాద‌యాత్ర‌కు బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకోకుండా.. అంత ఇబ్బందిలోనూ ప్ర‌జ‌ల‌తో ఉత్సాహంగా సాగుతున్న వైనం అంద‌రిని అబ్బుర‌ప‌డేలా చేస్తోంది. ప్ర‌స్తుతం చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని నెన్నూరు శివారు నుంచి ఆదివారంం పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్.. శెట్టివారిప‌ల్లి క్రాస్‌.. దేశూరి కండ్రిగ‌.. రావిళ్ల‌వారిప‌ల్లి శివారు.. పారకాల్వ క్రాస్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర పొడ‌వునా ప్ర‌జ‌లు మేళ‌తాళాలు.. డ‌ప్పులు.. బాణ‌సంచా పేలుళ్ల‌తో ఎదురెళ్లి స్వాగ‌తం ప‌లికారు. ప‌లువురు మ‌హిళ‌లు మంగ‌ళ‌హార‌తులు ప‌లికారు.

జ‌గ‌న్ తో సెల్ఫీలు దిగేందుకు పోటీ ప‌డ్డారు. ఇంటికి పెద్ద కొడుకు వ‌చ్చినంత ఆనందంగా ఉంద‌ని ప‌లువురు వ్యాఖ్యానించుకోవ‌టం క‌నిపించింది. జ‌లుబు.. ద‌గ్గుతో నీర‌సంగా ఉన్నా.. దాన్ని ప‌ట్టించుకోకుండా త‌న‌ను చూసేందుకు.. త‌న మాట‌లు వినేందుకు వ‌చ్చిన ప్ర‌జ‌ల ఉత్సాహాన్ని ఏ మాత్రం త‌గ్గ‌కుండా జ‌గ‌న్ జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌టం క‌నిపించింది.

పండ‌గ హ‌డావుడి ఓవైపు ఉన్నా.. జ‌గ‌న్ ను చూసేందుకు ప్ర‌జ‌లు పోటెత్తుతున్న వైనం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ట్టుకుంటోంది. జ‌గ‌న్ ను చూసేందుకు పెద్ద వ‌య‌స్కులు సైతం ఆస‌క్తిగా ఎదురుచూడ‌టం కనిపిస్తోంది. కొంద‌రు యువ‌తీయువ‌కులు జ‌గ‌న్ పాద‌యాత్ర వ‌ద్ద‌కు చేరుకొని దివంగ‌త మ‌హానేత వైఎస్ హ‌యాంలో అమ‌లు చేసిన ఫీజ్ రియంబ‌ర్స్ మెంట్ కార‌ణంగా చ‌దువుకొని.. ఇప్పుడు ఉద్యోగాలు చేసుకున్న‌ట్లు చెప్పుకొచ్చారు. ప‌లువురు వృద్ధులు త‌మ పెన్ష‌న్ల‌ను బాబు స‌ర్కారు తీసేసింద‌ని ఫిర్యాదు చేశారు.

సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా ఈ రోజు పాద‌యాత్ర‌కు బ్రేక్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. మార్గ‌మ‌ధ్యంలోనే సంక్రాంతి పండ‌గ‌ను త‌న వారితో క‌లిసి జ‌రుపుకోనున్నారు. జ‌లుబు.. దగ్గుతో ఇబ్బంది ప‌డుతున్న జ‌గ‌న్ ను చూసేందుకు ఆయ‌న స‌తీమ‌ణి భార‌తి ఈ రోజు పాద‌యాత్ర వ‌ద్ద‌కు చేరుకున్నారు.